Jogi Ramesh : వారి కలయిక వ్యాక్సిన్ కాదు వైరస్
వైసీపీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్
Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ, జనసేన పార్టీల కలయికపై మండిపడ్డారు. రెండు పార్టీలు వ్యాక్సిన్ కాదని అవి జనానికి వైరస్ ఎక్కించేలా చేస్తాయంటూ ఎద్దేవా చేశారు.
Jogi Ramesh Serious Comments on TDP and Janasena
గురువారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే విచారణకు హాజరు కావాల్సిందేనన్నారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కైన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంకా పశ్చాతాపం పడాల్సింది పోయి కోర్టులలో పిటిషన్లు వేయడం దారుణమన్నారు.
45 ఏళ్ల రాజకీయ జీవితం అంటూ ఊదరగొట్టే చంద్రబాబు తన కాలంలో అందినంత మేర దోచుకునేందుకే ఎక్కువ సమయం కేటాయించారని ఆరోపించారు జోగి రమేష్(Jogi Ramesh). ప్రజలు ఛీత్కరించినా ఇంకా టీడీపీ నేతలకు బుద్ది రావడం లేదన్నారు. గత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేశారని ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని జోష్యం చెప్పారు.
ఇన్నేళ్లుగా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడుకు జగన్ హయాంలో వర్కవుట్ కాలేదన్నారు. ఏం ముఖం పెట్టుకుని కలిసి పోరాడుతామని ప్రగల్భాలు పలుకుతారంటూ మండిపడ్డారు.
Also Read : High Security : హైదరాబాద్ లో హై అలర్ట్
