Jonny Bairstow : బెయిర్ స్టో మామూలోడు కాదబ్బా
చెప్పి కొట్టడంలో టార్చ్ బేరర్
Jonny Bairstow : జానీ బెయిర్ స్టో ఇప్పుడు భారతీయ క్రికెటర్ల పాలిట ఇబ్బందికరంగా మారాడు. ఎలాంటి బంతులు వేసినా వాటిని ఫోర్లు, సిక్సర్లుగా మార్చేస్తూ ఔరా అని విస్తు పోయేలా చేస్తున్నాడు ఈ ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్.
మనోడికి ఇండియాలో ఆడడం కూడా ప్లస్ పాయింట్ గా మారింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL) లో 2018, 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. ఈసారి 2022లో జరిగిన రిచ్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
ఇక షార్జాలో జరిగిన టి10 లీగ్ లో కేరళ కింగ్స్ తరపున ఆడేందుకు సంతకం చేశాడు. కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొని 84 రన్స్ చేశాడు. ఈ
పొట్టి ఫార్మాట్ లో ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది బెయిర్ స్టో(Jonny Bairstow) మీద.
ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటలో ఊహించని రీతిలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు తీసుకుంది. దేశీయంగా యార్క్ షైర్ తరపున ఆడుతున్నాడు.
పూర్తి పేరు జోనాథన్ మార్క్ బెయిర్ స్టో. 26 సెప్టెంబర్ 1989లో పుట్టాడు. స్టో వయసు 32 ఏళ్లు. కుడి చేతి బ్యాటర్. మంచి వికెట్ కీపర్ కూడా. 2011
నుంచి ఆడుతున్నాడు.
17 మే 2012లో విండీస్ తో టెస్టు క్రికెట్ స్టార్ట్ చేశాడు. ఇక వన్డేలో 16 సెప్టెంబర్ 2011లో ఇండియాతో ఆడాడు. టి20 మ్యాచ్ లను 23 సెప్టెంబర్
2011లో ప్రారంభించాడు బెయిర్ స్టో(Jonny Bairstow).
ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో బర్మింగ్ హోమ్ లో దుమ్ము రేపాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతే కాదు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఆపై రెచ్చి పోయి దంచి కొట్టాడు. తాను మగాడినని నిరూపించుకున్నాడు.
Also Read : భారత్ కు షాక్ గెలుపు బాటలో ఇంగ్లండ్