Jonty Rhodes : మోదీకి జాంటీ రోడ్స్ ధ‌న్య‌వాదాలు

భార‌త్ కు రిప‌బ్లిక్ డే గ్రీటింగ్స్

Jonty Rhodes : ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్ , స్టార్ ఫీల్డ‌ర్ గా పేరొందిన జాంటీ రోడ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న 73వ రిప‌బ్లిక్ డే జ‌రుపుకుంటున్న భార‌త దేశ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇప్ప‌టికే వెస్టిండీస్ స్టార్ హిట్ట‌ర్ క్రిస్ గేల్ సైతం భారత దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాజాగా గేల్ స‌ర‌స‌న జాంటీ రోడ్స్(Jonty Rhodes) కూడా చేరి పోయారు.

తాను ఎంతో సంతోషానికి లోన‌య్యాన‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక సందేశం పంపించారు మోదీ ఆయా క్రికెట‌ర్ల‌కు.

భార‌త దేశంతో ఈ ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మెస్సేజ్ పంపించారు.

కాగా ఇప్ప‌టికే ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు కోచ్ గా ఉన్నారు జాంటీ రోడ్స్ (Jonty Rhodes). ఆయ‌న కూతురుకు ఇండియా అని పేరు పెట్టుకున్నాడు.

ఇండియాలో ఆడే స‌మ‌యంలో ఫీల్డింగ్ కోచ్ గా ప‌ని చేస్తున్న జాంటీ రోడ్స్ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది.

అందులో భాగంగానే మోదీ ప్ర‌త్యేకించి వీరిద్ద‌రికీ సందేశం పంపించారు.

కొన్నేళ్లుగా ఈ దేశంతో, దాని సంస్కృతితో అనుబంధాన్ని క‌లిగి ఉన్నందుకు అభినంద‌న‌లు.

ప్ర‌త్యేకించి మీ కూతురుకు ఇండియా అని పేరు పెట్టినందుకు ప్ర‌త్యేకంగా మిమ్మ‌ల్ని అభినందిస్తున్నానంటూ జాంటీ రోడ్స్ కు మెస్సేజ్ చేశారు.

ఇరు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాల‌కు మీరు నిజ‌మైన రాయ‌బారులంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు మోదీ.

ఇదిలా ఉండగా గేల్, రోడ్స్ ఇద్దరూ ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా జాంటీ రోడ్స్ స్పందిస్తూ మోదీజీ మీ మాట‌లు స్పూర్తి దాయ‌కంగా ఉన్నాయి. ఇండియాకు వ‌చ్చిన సంద‌ర్బంలో నేను ఒక వ్య‌క్తిగా ఎదిగాను. భార‌తీయ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను

ప‌రిర‌క్షించే రాజ్యాంగం ప్రాముఖ్య‌త‌ను గౌర‌విస్తూ నా కుటుంబం మొత్తం భార‌త్ తో క‌లిసి రిప‌బ్లిక్ డే జ‌రుపుకుంటుంద‌ని ట్వీట్ చేశాడు.

Also Read : తొంద‌ర‌పాటు నిర్ణ‌యం ప‌శ్చాతాపం

Leave A Reply

Your Email Id will not be published!