Jos Butler : మ‌రోసారి రెచ్చి పోయిన జోస్ బ‌ట్ల‌ర్

రాణించినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

Jos Butler : ఐపీఎల్ 2022 ఫ‌స్టాఫ్ లో అద్భుతంగా రాణించ‌డ‌మే కాదు ఏకంగా 3 సెంచ‌రీలు హాఫ్ సెంచ‌రీలతో దుమ్ము రేపాడు స్టార్ హిట్ట‌ర్, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler).

గుజ‌రాత్ టైటాన్స్ తో కోల్ క‌తా ఈడెన్ గార్డెన్ మైదానంలో జ‌రిగిన క్వాలిఫయిర్ 1లో దుమ్ము రేపాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 56 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న జోస్ బ‌ట్ల‌ర్ 12 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు.

మొత్తం 89 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్స్ చేసిన కొన్ని పొర‌పాట్లు కూడా బ‌ట్ల‌ర్ కు క‌లిసి వ‌చ్చేలా చేశాయి. ఫ‌స్టాఫ్ లో దుమ్ము రేపిన బ‌ట్ల‌ర్ సెకండాఫ్ లో విఫ‌ల‌మ‌య్యాడు.

కానీ ఐపీఎల్ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో నిలిచాడు బ‌ట్ల‌ర్. ఏకంగా 700కి పైగా ప‌రుగులు చేసి అవార్డు రేసులో నిలిచాడు.

ఇక అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కు ఇచ్చే ప‌ర్పుల్ క్యాప్ రేసులో సైతం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు చెందిన స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ నిలిచాడు.

ఇప్ప‌టి దాకా 26 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ ఆదిలోనే య‌శ‌స్వి జైశ్వాల్ వికెట్ ను కోల్పోయింది. ఈ త‌రుణంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో చాలా ప‌ద్ద‌తిగా, కూల్ గా ఎలాంటి షాట్స్ కు వెళ్ల‌కుండా ఉండి పోయాడు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler).

ఓ వైపు కెప్టెన్ సంజూ శాంస‌న్ రెచ్చి పోతుంటే అత‌డికే ఆడేందుకు ఎక్క‌వ‌గా చాన్స్ ఇచ్చాడు. మొత్తంగా బ‌ట్ల‌ర్ జోర్దార్ ఇన్నింగ్స్ రాజ‌స్తాన్ కు క‌లిసి వ‌చ్చేలా చేసినా గుజ‌రాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Also Read : నేస్త‌మా ఇద్ద‌రి లోకం ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!