Jos Butler Padikkal : ఐపీఎల్ 2022లో ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రికార్డులు నమోదయ్యాయి. ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది.
15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు
దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అరుదైన ఘనతను నమోదు చేసింది.
జట్టు పరంగా మొదటి వికెట్ కు రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.
ఓపెనర్లు జోస్ బట్లర్(Jos Butler Padikkal) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక మరో ఓపెనర్ దేవదత్ పడిక్కలు సత్తా చాటాడు.
వీరిద్దరూ కలిసి 95 బంతులు ఆడి 155 రన్స్ చేశారు. ఇది ఓ రికార్డు . ఇక జోస్ బట్లర్ 65 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 9 సిక్సర్లతో 116 రన్స్ చేశాడు.
ఇక దేవదత్ పడిక్కల్ 35 బంతులు ఎదుర్కొని 54 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ లో ఈ రకమైన భాగస్వామ్యం ఆ జట్టుకు ఉండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇక కెప్టెన్ శాంసన్ 46 రన్స్ చేశాడు. 19 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
ఇక జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్(Jos Butler Padikkal) భాగస్వామ్యంలో వచ్చిన 155 రన్స్ లలో 16 ఫోర్లు 12 సిక్సర్లు ఉన్నాయి.
ఫోర్ల పరంగా 64 పరుగులు వచ్చాయి సిక్సర్ల ద్వారా 72 రన్స్ రావడం విశేషం.
ఈ రెండు కలిస్తే కేవలం ఫోర్లు, సిక్సర్లతో 155 రన్స్ లలో 136 పరుగులు రావడం గమనార్హం.
ఏది ఏమైనా బట్లర్ షాన్ దార్ ఇన్నింగ్స్ పడిక్కల్ జోర్దార్ బ్యాటింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కు ఎక్కించింది.
Also Read : మెరిసిన దేవదత్ పడిక్కల్