RR vs KKR : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ మరోసారి మెరిశాడు. అద్భుతమైన ఆట తీరును కనబర్చాడు. 15వ సీజన్ లో బట్లర్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
103 పరుగులు చేసి అవుటయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్(RR vs KKR )ముందు భారీ స్కోర్ సాధించి టార్గెట్ ముందుంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.
కేకేఆర్ ముందు 218 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆఖరులో మరోసారి సిమ్రోన్ హిట్ మైర్ మళ్లీ మెరుపులు మెరిపించాడు. 13 బంతులు ఎదుర్కొని 26 న్స చేశాడు.
అంతకు ముందు బరిలోకి దిగగిన కెప్టెన్ సంజూ శాంసన్ 38 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 24 పరుగులు చేసి సునీల్ సరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇక బట్లర్ అవుటయ్యాక వచ్చిన రియాన్ పరాగ్ సిక్స్ కొట్ట బోయి వికెట్ పారేసుకున్నాడు. అంతకు ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇదిలా ఉండగా రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడింది. ఇందులో మూడు గెలిచి రెండు మ్యాచ్ లు ఓడి పోయింది. ఇక కేకేఆర్ ఆరు మ్యాచ్ లు ఆడింది. మూడు గెలిచి మూడు పరాజయం మూటగట్టుకుంది.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 14 సీజన్లలో ఇరు జట్లు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ 13 సార్లు గెలుపొందగా రాజస్థాన్ రాయల్స్ 11 సార్లు విజయం సాధించింది.
Also Read : మాలిక్ మామూలోడు కాదు మగాడు