Jos Buttler : మ‌రోసారి మెరిసిన జోష్ బ‌ట్ల‌ర్

స‌త్తా చాటినా స‌క్సెస్ కాలేదు

Jos Buttler  : ఐపీఎల్ 2022లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్న ఆట‌గాళ్ల‌లో రాజస్థాన్ రాయ‌ల్స్ కు చెందిన ఓపెన‌ర్ , స్టార్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆడిన ప్ర‌తి మ్యాచ్ లోనూ స‌త్తా చాటుతున్నాడు.

త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ప‌రుగులు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ త‌రుణంలో గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో మ‌రోసారి జోస్ బ‌ట్ల‌ర్(Jos Buttler )మెరిశాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

ఒక వేళ ఇంకా కొద్ది సేపు క‌నీసం 5 ఓవ‌ర్ల దాకా ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేది. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ దెబ్బ‌కు పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

మ‌రో సిక్స్ కొట్ట‌బోయి వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు జోష్ బ‌ట్ల‌ర్. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 192 ప‌రుగులు చేసింది. టార్గెట్ ఛేద‌న‌లో 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులే చేసి చాప చుట్టేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ .

ఈ స్కోర్ లో ఇద్ద‌రే స‌త్తా చాటారు. ఒక‌రు జోష్ బ‌ట్ల‌ర్ అయితే మ‌రొక‌రు హెట్ మైర్. ఇక బ‌ట్ల‌ర్ 53 ర‌న్స్ చేస్తే ఇందులో 8 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన జోష్ బ‌ట్ల‌ర్ వ‌చ్చీ రావ‌డంతోనే దంచి కొట్ట‌డం మొద‌లు పెట్టాడు.

భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి చుక్క‌లు చూపించాడు బ‌ట్ల‌ర్. ఇక సిమ్రాన్ హిట్ మైర్ కొద్ది సేపు క్రీజులో ఉండి ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేది. మొత్తంగా ఇది పూర్తిగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వైఫ‌ల్యం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ జ‌ట్టు ఓట‌మికి కెప్టెన్ సంజూ శాంస‌న్ దే బాధ్య‌త. ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మూడో స్థానానికి ప‌డి పోయింది.

Also Read : రియ‌ల్ హీరో ఓడియ‌న్ స్మిత్

Leave A Reply

Your Email Id will not be published!