Yashasvi Jaiswal Butler : నా వ‌ల్లే జోస్ బ‌ట్ల‌ర్ ర‌నౌట్ – జైశ్వాల్

త‌న వికెట్ ను త్యాగం చేశాడు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన యంగ్ క్రికెట‌ర్ య‌శస్వి జైస్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కోల్ క‌తా వేదిక‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో కీల‌క లీగ్ మ్యాచ్ జ‌రిగింది. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 149 ర‌న్స్ చేసింది. అనంత‌రం 150 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 13.1 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది.

య‌శ‌స్వి జైస్వాల్ 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో క‌లిపి 90 ప‌రుగులు వ‌చ్చాయి. జైస్వాల్ కు తోడు కెప్టెన్ సంజూ శాంస‌న్ 29 బంతులతో 47 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 2వ వికెట్ కు 121 ర‌న్స్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ సంద‌ర్భంగా జైశ్వాల్ , జోస్ బ‌ట్ల‌ర్ మ‌ధ్య చోటు చేసుకున్న మిస్ అండ‌ర్ స్టాండింగ్ కార‌ణంగా జోస్ బ‌ట్ల‌ర్ ర‌నౌట్ అయ్యాడు. త‌న వ‌ల్ల‌నే బ‌ట్ల‌ర్ ర‌న్ చేసేందుకు వ‌చ్చాడ‌ని, ఇది పూర్తిగా త‌న త‌ప్పు అని అంగీక‌రించాడు. మ్యాచ్ అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడాడు. తాము జ‌ట్టు గెలుపు కోసం ప‌ని చేస్తామ‌ని వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ప‌ని చేయ‌మంటూ స్ప‌ష్టం చేశాడు.

బ‌ట్ల‌ర్ భాయ్ అంటే త‌న‌కు ఇప్ప‌టికీ ఎన‌లేని గౌర‌వం ఉంద‌న్నాడు. ఆయ‌న త‌న కోసం త్యాగం చేశాడంటూ కొనియాడాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క్ష‌మించ‌మ‌ని కోరాడు య‌శ‌స్వి జైశ్వాల్ .

Leave A Reply

Your Email Id will not be published!