Joseph Vijay Party : సెప్టెంబర్ లో తలపతి కొత్త పార్టీ ?
జోసెఫ్ విజయ్ ఆ దిశగా అడుగులు
Joseph Vijay Party : తమిళనాడు రాజకీయాలలో మరో హీరో పొలిటికల్ పార్టీ పెట్ట బోతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందిన ఆ హీరోనే తలపతి విజయ్. ఇప్పటి వరకు మినిమం గ్యారెంటీ ఉన్న నటుడిగా పేరు పొందాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ తనను తాను టాప్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు.
కానీ ముందు నుంచీ ఇంట్రావర్ట్ గా ఉన్న విజయ్ రాను రాను తన విలక్షణ నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు. బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో నటించిన జోసెఫ్ విజయ్ ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డాడు. ఎదుటి వాళ్లకు సాయం చేయడంలో ముందుంటాడనే పేరు కూడా ఉంది.
Joseph Vijay Party to Start
రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని(Joseph Vijay Party) అంతా భావించారు. తన పేరుతో రిజిస్టర్ చేసిన ఫ్యాన్స్ సంఘాన్నే పార్టీ పేరు కూడా రిజిస్టర్ చేసినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. దీనిపై కోర్టుకు ఎక్కాడు విజయ్. తన తండ్రి దానిని ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో కలకలం రేపింది.
గత ఎన్నికల్లో అంతర్గతంగా డీఎంకే స్టాలిన్ సర్కార్ కు మద్దతు ఇచ్చాడు. ఈసారి ఎలాగైనా సరే తనేమిటో ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దక్షిణాది సినీ రంగంలో అత్యధిక పారితోషం తీసుకునే అతి కొద్ది మంది నటుల్లో జోసెఫ్ విజయ్ ఒకరు. తాజాగా అందిన సమాచారం మేరకు సెప్టెంబర్ లో పొలిటికల్ పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్.
Also Read : YS Sharmila Viveka : నా వద్ద ఆధారాలు లేవు – షర్మిల