Rupees Journey : 1947 నుంచి నేటి దాకా రూపాయి జర్నీ
డాలర్ కు నాడు 4 రూపాయలు నేడు 80
Rupees Journey : దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం.
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రూపాయి(Rupees Journey) ప్రస్థానం 1947 నాటి నుంచి 2022 దాకా ఎలా మారిందో చూసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆనాడు డాలర్ కు రూ. 4 ఉంటే ఇవాళ అదే డాలర్ కు రూ. 80 రూపాయలుగా మారింది.
గతంలో ఎన్నడూ లేనంతగా మోదీ కొలువు తీరాక రూపాయి పతనం అంచున చేరింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు పెరిగింది. రాబోయే 25 ఏళ్లలో దేశం అందరికంటే ముందుండాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఒక దేశ కరెన్సీ విలువ దాని ఆర్థిక మార్గాన్ని అంచనా వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. దేశానికి స్వేచ్ఛ లభించిన నాటి నుంచి ఆర్థిక రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
1960లో ఆహారం, పారిశ్రామిక ఉత్పత్తిలో తిరోగమనం ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఆ తర్వాత ఇండో చైనా , ఇండో పాకిస్తాన్ వచ్చాయి.
ఇవి ఖర్చును మరింత పెంచాయి. చెల్లింపులు అధికం కావడం సంక్షోభానికి దారితీశాయి. అధిక దిగుమతి బిల్లులతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపుగా ఖాళీ అయ్యాయి.
దీంతో దేశం డిఫాల్ట్ అయ్యింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చింది. రూపాయి
విలువ యుఎస్ డాలర్ తో పోలిస్తే రూ. 4.76 నుండి రూ. 7.5కి చేరింది.
అనంతరం 1991లో భారత దేశం తన దిగుమతులకు చెల్లించ లేని స్థితిలో ఉండి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి చేరింది. ఈ తరుణంలో ఆర్బీఐ రెండు విడతలుగా రూపాయి విలువను తగ్గించింది.
వరుసగా 9 శాతం, 11 శాతానికి తగ్గించింది. ఆనాడు డాలర్ విలువ రూ. 26కి చేరింది. గత 75 ఏళ్లలో రూపాయి విలువ రూ. 75కి తగ్గింది. రూపాయి బలహీన పడడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు.
రికార్డు స్థాయిలో $31 బిలియన్లకు పెరిగింది. 1991 ఆర్థిక సంస్కరణల నుండి అమెరికా, భారత్ మధ్య ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు వ్యత్యాసం కారణంగా రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే 3.74 శాతం చొప్పున క్షీణిస్తోంది.
Also Read : భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం