JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కొలువు తీరిన సీఎం జైరాం ఠాకూర్ ను మారుస్తారని ఆయన స్థానంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ను నియమిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని ఎత్తి చూపింది ఆప్. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనురాగ్ ఠాకూర్ ను సీఎంగా చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఆప్ ను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. తాజాగా జేపీ నడ్డా(JP Nadda ), అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో ఆప్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ అనూప్ కేసరి.
ఈ తరుణంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం జైరాం ఠాకూర్ సారథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలకు వెళతామని ప్రకటించారు బీజేపీ చీఫ్. ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయమన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇందులో భాగంగా ఏ ఒక్క మంత్రిని తాము మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జేపీ నడ్డా(JP Nadda ).
హిమాచల్ న్నికలకు ఆయన నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సీఎంగా కొనసాగుతున్న జైరాం ఠాకూర్ అద్భుతంగా పని చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.
Also Read : మాజీ మంత్రి బాబు సింగ్ అరెస్ట్