JR NTR Mammootty Viswanth : కె విశ్వ‌నాథ్ మ‌హానుభావుడు

సినీ న‌టుల ఘ‌న నివాళులు

JR NTR Mammootty Viswanth : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ మ‌ర‌ణం త‌మ‌ను బాధ‌కు గురి చేసింద‌ని పేర్కొన్నారు న‌టీన‌టులు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రాధిక , మ‌మ్ముట్టి, అనిల్ క‌పూర్ , జ‌య‌ప్ర‌ద‌, క‌మ‌ల్ హాస‌న్ తో పాటు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లోనే అరుదైన ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ అని కొనియాడారు న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్(JR NTR). ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహ‌మాన్ సైతం స్పందించారు.

క‌ళాత‌ప‌స్వి మృతి తెలుగు సినిమా రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి స్పందించారు( Mammootty). ఆయ‌న స్వాతి కిర‌ణం చిత్రంలో న‌టించారు. ఆయ‌న మ‌హానుభావుడు వ‌ద్ద ప‌ని చేయ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా కె విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య కాశీనాధుని జయలక్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కె విశ్వనాథ్ 1965లో ఆత్మ గౌరవంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. అతని ఉత్తమ చిత్రాలలో స్వాతి ముత్యం, సిరివెన్నెల, శంకరాభరణం, మరియు సాగర సంగమం వంటివి ఉన్నాయి.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!