Sippy Sidhu : షూటర్ సిప్పీ హత్య కేసులో జడ్జి కూతురు అరెస్ట్
కళ్యాణి సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Sippy Sidhu : దేశ వ్యాప్తంగా 2015లో సంచలనం సృష్టించిన కార్పొరేట్ లాయర్ సిప్పీ సిద్దూ(Sippy Sidhu) హత్య కేసులో జడ్జి కూతురు ను బుధవారం అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
సిప్పీ సిద్దూ అసలు పేరు సుఖ్ మన్ ప్రీత్ సింగ్ . ఆనాడు ఓ పార్కులో కాల్చి చంపబడ్డాడు. ఈ ఘటన చండీగఢ్ లో చోటు చేసుకుంది. జాతీయ
స్థాయి షూటర్ గా పేరొందాడు సిద్దూ.
ఇదిలా ఉండగా హత్య జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. ప్రస్తుతం
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు సబీనా.
ఆమె కూతురు కళ్యాణి సింగ్ కు ప్రమేయం ఉన్నట్లు తేలడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొదటి వ్యక్తి ఆమె .
కాగా చాలా కాలంగా కళ్యాణి సింగ్ అనుమానితురాలిగా పేర్కొన్నారు. అయితే సిప్పీ సిద్దూ(Sippy Sidhu)ను కాల్చి చంపిన మరొక వ్యక్తితో కలిసి ఉన్నట్లు భావిస్తున్నారు.
అయితే వీరి మధ్య సంబంధాలు చెడి పోవడం వల్లే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా కళ్యాణి సింగ్ ను విచారించేందుకు ఏజెన్సీ నాలుగు రోజుల రిమాండ్ ను పొందింది.
2016లో దర్యాప్తు ప్రారంభ దశ నుంచి ఆమె పాత్రపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది. హంతకుడితో పాటు ఒక మహిళ ఉందని స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని రిపోర్ట్ లో కూడా పేర్కొంది. 2015 సెప్టెంబర్ 20న చండీగఢ్ లోని సెక్టార్ 27లోని పార్క లో కార్పొరేట్ లాయర్ సిప్పీ బుల్లెట్ తో కూడిన మృతదేహం కనుగొన్నారు.
35 ఏళ్ల సిద్దూ మొహాలీలో నివసించారు. అతడు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ సిద్దూ మనుమడు.
Also Read : ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’