Chai Pani Award : ఉత్త‌మ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

యుఎస్ లో అత్యుత్త‌మ పుర‌స్కారం

Chai Pani Award : భార‌త దేశానికి చెందిన వంట‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డంలో అమెరికాలోని చాయ్ పానీ రెస్టా రెంట్ ముందుంటుంది. రెస్టా రెంట్ కు వ‌చ్చే వారి అభిరుచుల మేర‌కు తిను బండారాల‌తో పాటు అన్నింటిని ఇక్క‌డ ఏర్పాటు చేశారు.

తాజాగా అమెరికాలోనే అత్యుత్త‌మ రెస్టా రెంట్ గా భార‌త్ కు చెందిన చాయ్ పానీ(Chai Pani Award) ఎంపికైంది. ఆషె విల్లేలో చౌక ధ‌ర‌ల‌కు భార‌తీయ ఆహారాన్ని అందిస్తోంది ఈ రెస్టారెంట్.

ప్ర‌తి ఏటా అమెరికాకు చెందిన జేమ్స్ బియ‌ర్డ్ ఫౌండేష‌న్ ఉత్త‌మ రెస్టారెంట్ల‌ను ప‌రిశీలించి ఉత్త‌మ రెస్టారెంట్ కు పుర‌స్కారం అంద‌జేస్తుంది. ఈ ఏడాది 2022కు గాను భార‌త్ కు చెందిన చాయ్ పానీకి ఈ అవార్డు ద‌క్కింది.

ఈ చాయ్ పానీ రెస్టారెంట్ ను 2009లో ప్రారంభించారు. రాను రాను భార‌తీయ వంట‌కాల‌కు గిరాకీ ఏర్ప‌డ‌డంతో మేనేజ్ మెంట్ ఇత‌ర న‌గ‌రాల‌కు కూడా విస్త‌రించింది.

అక్క‌డ కూడా చాయ్ పానీ బ్రాంచ్ ల‌ను ఏర్పాటు చేసింది. చికాగోలో జ‌రిగిన జేమ్స్ బియ‌ర్డ్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అవార్డులు ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు చాయ్ పానీ(Chai Pani Award) నిర్వాహ‌కులు ఈ అత్యుత్త‌మ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఉల్లాస‌మైన , ప్ర‌కాశవంత‌మైన వ‌స్తువుల‌లో చాట్ ఒక‌టి.

చాయ్ పానీ ఇత‌ర స్ట్రీట్ ఫుడ్ కాకుండా డిఫ‌రెంట్ గా ఉండేలా విక్ర‌యిస్తోంది ఈ రెస్టా రెంట్. చాట్ కోసం అయితే $8 డాల‌ర్లు , థాలీస్ కోసమైతే $17 డాల‌ర్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ చాయ్ పానీ చెఫ్‌, మెహ‌ర్వాన్ ఇరానీ అవార్డుల‌లో కూడా నామినేట్ అయ్యింది.

Also Read : కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ

Leave A Reply

Your Email Id will not be published!