#JackfruitBiryani : కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ

కోనసీమలో పనస తొనలతో బిర్యానీ చేసుకుంటారు.

PanasakayaBiryani : పనసకాయను మనం కేవలం పండుగ మాత్రమే తింటాం. కానీ కోనసీమలో పనస తొనలతో బిర్యానీ చేసుకుంటారు. అది అక్కడ ఫేమస్ కూడా. పనసకాయ సీజన్ లో తప్పని సరిగా దీనిని తయారు చేసుకుంటారు. అందుకే ఇప్పుడు మనం కూడా దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

పచ్చి పనసకాయ ముక్కలు – 2 కప్పులు
బాస్మతి అన్నం – 2 కప్పులు
కారం – 1 టీ స్పూను
ఉల్లిపాయలు – 2
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టేబుల్‌ స్పూను
పుదీనా తరుగు – 1 కప్పు
కొత్తిమీర తరుగు – 1 కప్పు
నూనె – 4 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు
లవంగాలు – 4
యాలకులు – 3
జీడిపప్పు – 6
దాల్చిన చెక్క – చిన్న ముక్కలు 2
బిర్యానీ ఆకు – 2
ఉప్పు – రుచికి సరిపడ
పచ్చిమిర్చి తరుగు – 1/4 కప్పు
పెరుగు – 1/2 కప్పు

తయారుచేయు విధానం :

ముందుగా మసాలాలు కొన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనస ముక్కలు కుక్కర్ లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు, మసాలా పొడి, ఉప్పు, సగం వేగిన ఉల్లిపాయ ముక్కలు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగిస్తూ కలపాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి. ఆ పైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూత పెట్టి చిన్నమంటపై 15 నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయినట్లే.

 

No comment allowed please