Julian Alvarez : అల్వారెజ్ బ‌హుమానం మెస్సీ ఆనందం

అర్జెంటీనా గెలుపులో కీల‌క పాత్ర

Julian Alvarez : ఖ‌తార్ వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లో మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా 3-0 తేడాతో క్రొయేషియాను ఓడించి ఫైన‌ల్ కు చేరింది. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు జూలియ‌న్ అల్వారెజ్. జ‌ట్టు చేసిన మూడు గోల్స్ ల‌లో రెండు గోల్స్ అల్వారాజె చేస్తే మ‌రో గోల్ ను స్కిప్ప‌ర్ లియానెల్ మెస్సీ చేశాడు.

మొత్తంగా క్రొయేషియాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు. ఆట ప్రారంభం నుంచి ముగిసే వ‌ర‌కు జూలియ‌న్ అల్వారెజ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ముప్పు తిప్ప‌లు పెట్టాడు. అర్జెంటీనా త‌ర‌పున హీరోగా మారాడు. త‌న సార‌థి మెస్సీకి గోల్స్ రూపంలో అద్భుత బ‌హుమానాన్ని అందించాడు జూలియ‌న్ అల్వారెజ్(Julian Alvarez).

ఇప్పుడు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో అల్వారెజ్ పేరు మారుమ్రోగుతోంది. మెస్సీ అయితే ప‌ట్ట‌రాని ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. యూ ఆర్ మై ల‌వ్ అంటూ కితాబు ఇచ్చాడు. ఇవాళ అర్జెంటీనా దేశం యావ‌త్తు క‌ప్పు గెలిచినంత సంబురంలో మునిగి పోయింది. ఎందుకంటే ఆ దేశం మొత్తం ఫుట్ బాల్ ను త‌మ ప్రాణం కంటే ఎక్కువ‌గా భావిస్తారు.

అందులో లీన‌మై పోతారు. కోట్లాది రూపాయ‌లు కురిసే ఈ ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో అరుదైన రికార్డులు న‌మోద‌య్యాయి. అంత‌కంటే టైటిల్ ఫేవ‌రేట్స్ గా ఉన్న బ్రెజిల్ , పోర్చుగ‌ల్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. కానీ మెస్సీ జ‌ట్టు మాత్రం ఇప్పుడు టైటిల్ వేట‌లో యుద్దానికి సిద్ద‌మైంది.

క‌ళ్లు చెదిరేలా ఆక‌ట్టుకునేలా అంద‌మైన రీతిలో గోల్ ను సాధించాడు అల్వారెజ్. అభిమానులు మాత్రం మెస్సీకి ఇది అరుదైన గిఫ్ట్ గా పేర్కొన‌డం విశేషం.

Also Read : ఐపీఎల్ సంబురం వేలానికి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!