Jupally Krishna Rao : మాజీ సీఎం ఆరోగ్యంపై ఆరా
కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి
Jupally Krishna Rao : హైదరాబాద్ – ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్టుండి బాత్రూంలో జారి పడి ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao). ఆయనకు తన తండ్రి ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చారు తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్. కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఆస్పత్రిలోనే ఉంది.
Jupally Krishna Rao Met KCR
ఇదిలా ఉండగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించేందుకు క్యూ కట్టారు. ఇప్పటి వరకు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు పరామర్శించిన వారిలో ఉన్నారు.
మాజీ సీఎం కింద పడడంతో తుంటి ఎముక విరిగింది. ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు. అది కూడా సక్సెస్ అయ్యిందని యశోద ఆస్పత్రి యాజమాన్యం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్, కవిత.
త్వరలోనే తమ తండ్రి కేసీఆర్ తిరిగి వస్తారని స్పష్టం చేశారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రస్తుతం ఆయన నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తను కోలుకుని , తిరిగి యధావిధిగా నడిచేందుకు కొంత సమయం పడుతుందని , ఆ మేరకు ఆరు వారాలైనా విశ్రాంతి కావాలని యశోద యాజమాన్యం స్పష్టం చేసింది.
Also Read : Satyavathi Rathod : సార్ చల్లంగా ఉండాలి – సత్యవతి