Jupally, Kuchukulla : స్వంత గూటికి జూప‌ల్లి, కూచుకుళ్ల

ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో చేరిక

Jupally Kuchukulla Join : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి తో పాటు కోడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) సార‌థ్యంలో పార్టీలో చేరు. జూప‌ల్లి, కూచుకుళ్ల‌, గురునాథ్ రెడ్డిల‌ను ఖ‌ర్గే పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ కాంగ్రెస్ కండువాల‌ను క‌ప్పారు.

Jupally Kuchukulla Join Congress

ఇక వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన మ‌రో నాయ‌కుడు మేగా రెడ్డితో పాటు ప‌లువురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు , మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి, కోడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలు గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జా ప్ర‌తినిధులుగా కొన‌సాగారు.

జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. చంద్ర‌బాబు నాయుడుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మించారు. జైలుకు కూడా వెళ్లారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్ )లో చేరారు. మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఇక కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా ప‌ని చేశారు. బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. ఆ పార్టీకి గుడ్ బై తిరిగి స్వంత గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ ర‌డ్డి సైతం కాంగ్రెస్ లో ఉన్నారు.

Also Read : K Annamalai : తీర‌న్ చిన్న‌మ‌లై కృషి ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!