CJI DY Chandrachud : సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ చంద్రచూడ్
రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సీజేఐ
CJI DY Chandrachud : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కొలువు తీరారు. బుధవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) తో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు సీజేఐగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 7న పదవీ విరమణ చేశారు.
ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ఇవాల్టి నుంచి చంద్రచూడ్ సీజేఐగా కొనసాగనున్నారు. ఆయన ఈ పదవిలో వచ్చే నవంబర్ 10, 2024 వరకు రెండు సంవత్సరాల పాటు ఉంటారు. ఇప్పటి వరకు జస్టిస్ చంద్రచూడ్ సర్వోన్నత న్యాయస్థానంలో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా పని చేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 11, 1959న పుట్టారు. మే 13, 2016లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ భారత దేశానికి 16 వ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు ఈ పదవిలో కొనసాగారు.
ఫిబ్రవరి 2, 1978 నుండి జూలై 11, 1985 దాకా ఉన్నారు. ఇదిలా ఉండగా జస్టిస్ చంద్రచూడ్(CJI DY Chandrachud) అక్టోబర్ 31, 2013 నుండి సుప్రీంకోర్టుకు ఆయన నియామకం జరిగేంత వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మార్చి 29, 2000 నుండి అలహాబాద్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యేంత వరకు బొంబాయి హైకోర్టుకు జడ్జీగా ఉన్నారు.
డీవై చంద్రచూడ్ 1998 నుండి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు భారత దేశానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా కూడా పని చేశారు. జూన్ 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. కీలకమైన, సంచలన తీర్పులను ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తిగా పేరొందారు చంద్రచూడ్.
Also Read : 50వ సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్