DY Chandrachud Comment : దేశం చూపు చంద్రచూడ్ వైపు
బలిపీఠంపై బందూక్ ఈ జస్టిస్
DY Chandrachud Comment : భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానానికి అత్యున్నత పదవిగా భావించే ప్రధాన న్యాయమూర్తి పదవిలో 50వ చీఫ్ జస్టిస్ గా కొలువు తీరనున్నారు ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. యావత్ భారతమంతా ఆయన వైపు చూస్తోంది. ఎందుకంటే న్యాయం అన్నది ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతోందన్న అభిప్రాయం కలుగుతున్న సమయంలో 50వ సీజేవైగా కొలువు తీరనున్నారు.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) పేరును కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కు పేరుంది. వయస్సు రీత్యా జస్టిస్ లలిత్ కొద్ది రోజుల పాటే ఉన్నా తనదైన ముద్ర కనబర్చారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా పేరుంది.
అంతే కాదు విస్తృతమైన అధికారాలు కలిగిన న్యాయ వ్యవస్థ ఇంకెక్కడా లేదు. యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తితో ఎదురు చూస్తోంది జస్టిస్ చంద్రచూడ్ వైపు. ఆయన ఎవరి వైపు ఉండరని, న్యాయం కోసం మాత్రమే పని చేస్తారన్న పేరు కూడా ఉంది. ఇది పక్కన పెడితే జస్టిస్ చంద్రచూడ్ ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు.
ఇదే క్రమంలో అత్యంత ప్రభావితం చేసే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన మాటలే కాదు తీర్పులు కూడా తూటాలను మరిపించేలా ఉంటాయని తెలిసిన వారు అంటుంటారు. ఇవాళ దేశంలో రాజకీయం, వ్యాపారం, మోసం , నేరం కలిసి ఉన్న తరుణంలో లెక్కకు మించిన కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
వీటన్నింటికి పరిష్కారం చూపే బాధ్యత కూడా జస్టిస్ చంద్రచూడ్ పై ఉంది. నవంబర్ 9న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారను. నవంబర్ 11, 2024 దాకా ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉంటారు చంద్రచూడ్. మే 13, 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అంతకు ముందు జస్టిస్ చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2000లో జస్టిస్ గా నియమించేంత దాకా. 1998 నుండి బాంబే హైకోర్టు బెంచ్ కు నియామకం అయ్యేంత దాకా భారత దేశ అదనపు సొలిసిటర్ జనరల్ గా ఉన్నారు చంద్రచూడ్.
జూన్ 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. తన కెరీర్ లో న్యాయశాస్త్రం, విద్యా రంగంలో ఆచరణాత్మక అనుభవం
రెండూ మిళితమై ఉన్నాయని చెప్పక తప్పదు. ముంబై యూనివర్శిటీ, ఓక్లహోమా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా, యుఎస్ లో కంపారిటివ్ కానిస్టిట్యూషన్ లా విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
ప్రపంచంలోని పలు సంస్థల్లో ప్రసంగించారు. మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ , అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియా
అభివృద్ధి బ్యాంకులతో పాటు అంతర్జాతీయ సంస్థల్లో వక్తగా ఉన్నారు జస్టిస్ చంద్రచూడ్. పౌర స్వేచ్ఛలు, వ్యక్తిగత , మహిళల హక్కుల
రంగంలో ఆయన ఇచ్చిన తీర్పులు సంచలనంగా మారాయి.
అబార్షన్ చట్టాల రక్షణకు ఒంటరి మహిళలు సమానంగా అర్హులని తాజా తీర్పు వెలువరించారు. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించారు.
ఆర్మీ, నేవీలో మహిళా షార్ట్ సర్వీస్ ఆఫీసర్లు శాశ్వత కమిషన్ కోసం పరిగణించే హక్కును సమర్థించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమం (మెన్సెస్ ) వచ్చే మహిళలకు ప్రవేశం కల్పించే హక్కును సమర్థించారు.
రామజన్మభూమి భూమిపై హిందువుల వాదనను ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురిలో ఆయన కూడా ఒకరు. జ్ఞాన్వాపి మసీదు కేసులో జస్టిస్ చంద్రచూడ్
నేతృత్వంలోని బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. దేశ వ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ జనాభా పెరుగుతున్న దుస్థితి గురించి
ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒక రోజు కూడా స్వేచ్చను కోల్పోవడం ఒక రోజు చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించారు జస్టిస్ చంద్రచూడ్. ఆధార్
గురించి ఒక వ్యక్తిని 12 అంకెల సంఖ్యకు తగ్గించందటూ కామెంట్ చేశారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు ఉద్యమకారుల హక్కులను సమర్థించే ఏకైక భిన్నాభిప్రాయం జస్టిస్ చంద్రచూడ్ ది. ఊహాగానాల బలిపీఠం వద్ద భిన్నాభిప్రాయాలను త్యాగం చేయలేమంటూ న్యాయ వ్యవస్థకు గుర్తు చేశారు. అసమ్మతి అనేది శక్తివంతమైన
ప్రజాస్వామ్యానికి ప్రతీక . ప్రజా వ్యతిరేకమైన కారణాలను చేపట్టే వారిని హింసించడం ద్వారా ప్రతిపక్షంలో ఉన్న గొంతులు మూగ బోవు అంటూ హెచ్చరించారు.
ఆర్టీఐపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ దానికి అతీతులు కారని స్పష్టం చేశారు. సీజేఐగా ఆయన ఇంకెన్ని తీర్పులు వెలువరిస్తారనేది వేచి చూడాలి.
Also Read : జియో..ఎయిర్ టెల్ 5జీ సేవలు షురూ