Justice K Chandru Comment : జై భీమ్ జ‌స్టిస్ చంద్రు

మ‌రోసారి సినిమా హాట్ టాపిక్

Justice K Chandru Comment  : త‌మిళ‌నాడుకు చెందిన ఓ న్యాయ‌మూర్తి జీవిత క‌థ ఆధారంగా జ్ఞాన‌వేల్ తీసిన జై భీమ్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. జాతీయ స్థాయి అవార్డులు ప్ర‌క‌టించారు. కానీ ఎంద‌రో ప్ర‌శంస‌లు అందుకుని ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసిన జై భీమ్ సినిమాకు పుర‌స్కారం ద‌క్క‌లేదు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ‌హాత్ముడిని చంపిన వాళ్లు అంబేద్క‌ర్ ఫిలాస‌ఫీని న‌మ్ముకుని ఆద‌ర్శ ప్రాయంగా నిలిచిన జ‌స్టిస్ చంద్రు(Justice K Chandru) జీవిత క‌థ ఆధారంగా తీసిన సినిమాకు అవార్డు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. ఇంత‌కూ జ‌స్టిస్ కె. చంద్రు ఎవ‌రు. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తూ వాహ‌నంలో కాకుండా బ‌స్సులో ఇంటికి వెళ్లి పోయారు. అప్ప‌ట్లో అది ఓ సంచ‌ల‌నం.

Justice K Chandru Comment Viral

జ‌స్టిస్ కె. చంద్రు స్వ‌స్థ‌లం తిరుచిర‌ప్ప‌ల్లి జిల్లా శ్రీ‌రంగం. మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. మార్చి 9 , 2013లో విధుల నుంచి నిష్క్ర‌మించారు. ఈ దేశంలో ఎంద‌రో న్యాయ‌మూర్తులు ఉన్నారు. కానీ జస్టిస్ కె. చంద్రు ప్ర‌త్యేకం. కార‌ణం ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ప్రేమించాడు. అణ‌గారిన వ‌ర్గాల వారిని అక్కున చేర్చుకున్నాడు. వారికి జ‌రుగుతున్న అన్యాయాన్ని లాయ‌ర్ గా ప్ర‌శ్నించాడు. జ‌డ్జిగా సంచ‌ల‌న తీర్పులు వెలువ‌రించారు.

జ‌స్టిస్ కె. చంద్రు త‌న అనుభ‌వాల‌తో త‌మిళంలో వేజ్ వార్ విత్ లా అనే పుస్త‌కాన్ని రాశారు. ఆయ‌న జీవిత క‌థ ఆధారంగా 2021లో జై భీమ్ సినిమాగా వ‌చ్చింది. అది ఓ సంచ‌ల‌నం సృష్టించింది. భార‌తీయ సినిమా రంగంలో ఇంత పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసిన సినిమా లేదంటే అతిశ యోక్తి కాదేమో.

త‌న జీవిత కాలంలో ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను వాదించాడు. జూలై 31, 2005న మ‌ద్రాస్ హైకోర్టు కు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మితుడ‌య్యాడు. నవంబ‌ర్ 9, 2009లో శాశ్వ‌త జ‌డ్జిగా ఉన్నారు. వేలాది కేసుల‌ను ప‌రిష్క‌రించాడు.

ఆల‌యాల్లో మ‌హిళ‌ల‌కు ఎందుకు ప్ర‌వేశం లేదంటూ ప్ర‌శ్నించాడు. వారిని పూజారులుగా నియ‌మించాల‌ని తీర్పు చెప్పారు జ‌స్టిస్ కె. చంద్రు(Justice K Chandru). కులం, మ‌తంతో సంబంధం లేకుండా సామూహిక శ్మ‌శాన వాటిక‌లు ఉండాల‌న్నాడు.

1990లో గిరిజ‌న తెగ‌కు చెందిన కుటుంబం అన్యాయంగా జైలు పాలైంది. త‌న భ‌ర్త రాజ‌క‌న్నును కాపాడుకునేందుకు భార్య పార్వ‌తి మ‌ద్రాస్ హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేసింది. ఈ కేసును కె. చంద్రు(Justice K Chandru) వాదించి న్యాయం చేశాడు. ఇదే సినిమాలో క‌థాంశంగా తీసుకున్నారు. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో సూర్య జై భీమ్ గా న‌టించాడు.

జ‌స్టిస్ కె. చంద్రు జ‌డ్జిగా ఆరేళ్ల పాటు ఉన్నాడు. 96 వేల‌కు పైగా కేసులు ప‌రిష్క‌రించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. సామాజిక అస‌మాన‌త‌ల మీద దృష్టి పెట్టారు. ప‌ద‌వీ విర‌మ‌ణ కు ముందు ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. మిగ‌తా జ‌డ్జీల‌ను విస్తు పోయేలా చేశారు.

న్యాయం కోసం ఆక్రోశిస్తున్న త‌రుణంలో, న్యాయం ఎండ మావిగా మారిన స‌మ‌యంలో జ‌స్టిస్ కె. చంద్రు వాళ్లు ఇంకా ఉండ‌డం దేశం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. జై భీమ్ సినిమాకు అవార్డు రాక పోయినా ఏం ప‌ర్వాలేదు. ఎందుకంటే ఆ సినిమా స‌మాజాన్ని ప్ర‌శ్నించింది. నిల‌దీసింది. గొంతెత్తి ఎలుగెత్తి చాట‌డం నేర్పింది. ఈ దేశం ప్ర‌శ్నించే వాళ్ల‌ను కోరుకోదు. ఎందుకంటే వాళ్ల‌కు వంగి న‌మ‌స్కారం చేసే వాళ్లు మాత్ర‌మే కావాలి.

Also Read : Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ లో ఇబ్బంది పెట్టారు

Leave A Reply

Your Email Id will not be published!