K Annamalai : ఆత్మహత్యలు పరిష్కారం కావు – అన్నామలై
దయచేసి విద్యార్థులు సూసైడ్ చేసుకోవద్దు
K Annamalai : దయచేసి విద్యార్థులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై(K Annamalai). ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన తీవ్రంగా స్పందించారు. చెన్నై లోని క్రోంపేటకు చెందిన జగతీశ్వరన్ అనే విద్యార్థి నీట్ పరీక్షలో ఫెయిల్ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విచిత్రం ఏమిటంటే చెట్టంత కొడుకు సూసైడ్ చేసుకోవడంతో భరించ లేక తండ్రి సెల్వ శేఖర్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం తనను మరింత బాధకు గురి చేసిందని పేర్కొన్నారు కె. అన్నామలై.
K Annamalai Words About Chromepet Student Issue
నీట్ తో పాటు మరికొన్ని పరీక్షలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి ఎవరూ కూడా విద్యార్థులు సూసైడ్ కు పాల్పడ వద్దని విన్నవించారు. ఆత్మహత్యలు దేనికీ అంతం కాదని, దేనికీ పరిష్కారం చూపవన్న సంగతి గుర్తించాలని సూచించారు కె. అన్నామలై. మీ ఒక్క నిమిషం తప్పుడు నిర్ణయం వల్ల మీ పేరెంట్స్ జీవితాంతం ఇబ్బందికి గురవుతారన్న విషయం గమనించాలని పేర్కొన్నారు బీజేపీ స్టేట్ చీఫ్.
సాధారణంగా స్టూడెంట్స్ 10వ తరగతి, 12, కాలేజీ , సివిల్స్ పరీక్షలు , తదితర పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పిల్లలు సామాజిక ఒత్తిళ్లకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు కె. అన్నామలై.
Also Read : Jawan SRK : షారుక్ ఖాన్ జవాన్ వైరల్