Jawan Chaleya Song : బాద్ షా చ‌లేయా సాంగ్ హ‌ల్ చ‌ల్

షారుఖ్ కాన్ ..న‌య‌న తార రొమాన్స్

Jawan Chaleya Song : అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి. ఇక దిగ్గ‌జ న‌టుడిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మ‌రోసారి రొమాంటిక్ సాంగ్ లో లీన‌మై న‌టించాడు. మూవీ మేక‌ర్స్ చ‌లేయా(Chaleya) పేరుతో రూపొందించిన పాట‌ను విడుద‌ల చేశారు. ఇందులో బాద్ షా తో పాటు న‌య‌న‌తార న‌టించింది. ఈ పాట‌కు సంగీతం అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించారు. ఆర్జిత్ సింగ్ , శిల్పారావు పాడారు .

Jawan Chaleya Song Trending

పాట చిత్రీక‌ర‌ణ దుమ్ము రేపింది. షారుక్ ఖాన్ , న‌య‌న‌తార కెమిస్ట్రీ పండింది. పాట మ‌రింత రిచ్ గా వ‌చ్చింది. ఇక టేకింగ్ లో, మేకింగ్ లో త‌నకంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు అట్లీ కుమార్. జ‌వాన్ సినిమాకు సంబంధించి ఇది రెండో సాంగ్ కావ‌డం విశేషం.

ఈ చిత్రంలో షారుక్ ఖాన్ , విజ‌య్ సేతుప‌తి, న‌య‌న తార‌, దీపికా ప‌దుకొనే ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో జ‌వాన్ ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు కొన‌సాగుతున్నాయి. మొత్తంగా రూ. 220 కోట్లకు పైగా బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నాడు అట్లీ. దీనిపై భారీ హోప్ పెట్టుకున్నాడు న‌టుడు షారుక్ ఖాన్. త‌న భార్య గౌరీ ఖాన్ పేరుతో దీనిని నిర్మించాడు స‌ల్మాన్ ఖాన్.

Also Read : K Annamalai : ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కావు – అన్నామ‌లై

Leave A Reply

Your Email Id will not be published!