K Annamalai : తీర‌న్ చిన్న‌మ‌లై కృషి ప్ర‌శంస‌నీయం

త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై

K Annamalai : త‌మిళ‌నాడు ప్రాంతం గ‌ర్వించ‌ద‌గిన మ‌హోన్న‌త మాన‌వుడు తీర‌న్ చిన్న‌మ‌లై అని కొనియాడారు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీప్ కె. అన్నామ‌లై. ట్విట్ట‌ర్ వేదిక‌గా గుర్తు చేశారు. అనేక పోరాటాల‌లో బ్రిటీష్ వారిని ఓడించిన స్వాతంత్ర స‌మ‌ర యోధుడు తీర‌న్ చిన్న‌మ‌లై అని పేర్కొన్నారు. ఇవాళ తీర‌న్ చిన్న మ‌లై 218వ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కృషిని, దేశం కోసం చిన్న‌మ‌లై ప‌డిన త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

K Annamalai Words

తీర‌న్ చిన్న‌మ‌లై యుక్త వ‌య‌సులోనే యువ‌జ‌న ద‌ళాల‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. క‌ట్ట‌బొమ్మ‌న్ , పూలి తేవ‌న్ , మ‌రుదు సోద‌రుల‌తో క‌లిసి తెల్ల వారిపై దేశ స్వాతంత్రం కోసం పోరాడార‌ని అన్నారు కె. అన్నామ‌లై(K Annamalai).

1801లో బ్రిటీష్ వారిపై , ఈరోడ్ క‌విరిక్ యుద్దంలో , 1902 వాయు యుద్దం, 1804 అర‌చ‌లూరు యుద్దంలో విజ‌యం సాధించార‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ చీఫ్‌. తీర‌న్ చిన్న‌మ‌లైని మామూలుగా ఓడించ లేమ‌ని తెలిసి బ్రిటీష్ సైనికులు 1805లో దొంగ దెబ్బ కొట్టార‌ని , ఆయ‌న‌ను బంధించి సంగ‌కిరి కోట‌లో, ఆది పెర్కు దివాన లో ఉరి తీశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న జీవిత కాలంలో యుద్దంలోనే గ‌డిపినా దేవాల‌యాల కోసం తీర‌న్ చిన్న‌మ‌లై ఎంత‌గానో కృషి చేశారంటూ ప్ర‌శంసించారు.

Also Read : Chandrababu Naidu : ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ

 

Leave A Reply

Your Email Id will not be published!