K Haribabu : ఒడిశా నయా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ సీనియర్ నేత

మరోవైపు బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు బదిలీ చేసింది...

K Haribabu : భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(K Haribabu) ఒడిషా గవర్నర్‌గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌‌భవన్‌లో హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. అలాగే వివిధ రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. మిజోరాం గవర్నర్‌‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా బదిలీ చేసింది. ఇక ఇప్పటికే వరకు ఒడిశా(Odisha) గవర్నర్‌గా కొనసాగుతోన్న రఘుబర్ రాస్ రాజీనామాను కేంద్రం ఆమోదించింది. మిజోరాం కొత్త గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్‌ను నియమించింది.

K Haribabu As a Odisha Governor..

మరోవైపు బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు బదిలీ చేసింది. అలాగే కేరళ ప్రస్తుత గవర్నర్ ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్‌ను బిహార్ గవర్నర్‌గా పంపించింది. ఇంకో వైపు మణిపూర్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. ఆయన ఇటీవల వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆయన రిటైర్‌మెంట్ కావడంతో.. ఆయనను మణిపూర్‌ గవర్నర్‌గా నియమించింది. ఇక గవర్నర్ బదిలీలు, నియమకాలపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏపీ భాజపా అధ్యక్షుడిగా, విశాఖపట్నం ఎంపీగా పని చేసిన హరిబాబు.. 2021 నవంబరు 6న మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబరులో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డికి కొన్నాళ్లు ఆ రాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు. కంభంపాటి ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే సరిహద్దు రాష్ట్రం ఒడిశాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : MP Kiran Kumar Reddy : మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్న బోనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!