K Narayana : తెలుగు వారి లోగిళ్లలో టాప్ వినోద భరిత కార్యక్రమంగా (రియాల్టీ షో) గా పేరొందింది బిగ్ బాస్ షో. స్టార్ గ్రూప్ నకు చెందిన స్టార్ మా (టీవి) ఛానల్ లో ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా నిరంతరాయంగా ప్రసారం అవుతోంది.
ఈ కార్యక్రమంపై మొదటి నుంచీ మేధావులు, బుద్ది జీవులు, కొంత మంది మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని దీని వల్ల సమాజానికి ఎలాంటి మెస్సేజ్ లు ఇస్తున్నారంటూ మండి పడుతున్నారు.
ప్రధానంగా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఎక్కువగా చేస్తున్నది మాత్రం సీపీఐ జాతీయ కార్యదర్శి కొనకళ్ల నారాయణనే(K Narayana ). ఆయన ప్రతిసారి బిగ్ బాస్ ను వెంటనే నిషేధించాలని దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు.
చదువు కోవాల్సిన పిల్లలతో పాటు చిన్నారులు, పెద్దలు, యవతీ యువకులు, వృద్దులు సైతం బిగ్ బాస్ ను చూసి చెడి పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల బిగ్ బాస్ తో పాటు మిగతా రియాల్టీ షోల ప్రసారాలపై కన్నేసి ఉంచాలని, అభ్యంతకరమైనవిగా తేలితే వెంటనే నిషేధం విధించాలని కోరుతూ తెలుగు యువత అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అమరావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిం ధర్మాసనం. కలిసి కూర్చుని చూడలేక పోతున్నామని వాపోయింది. ఈ తరుణంలో తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన కొనకళ్ల నారాయణ మీడియాతో మాట్లాడారు.
యువతను పెడ దోరి పట్టిస్తున్న బిగ్ బాస్ ను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. హైకోర్టే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
Also Read : బాలయ్య సరసన మెహ్రిన్‌కి ఛాన్స్