K Srikanth : టీమిండియా కూర్పుపై శ్రీకాంత్ కామెంట్స్

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో శాంస‌న్ లేని లోటు క‌ష్టం

K Srikanth : గ‌త ఏడాది యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World cup) లో అట్ట‌ర్ ప్లాప్ షోతో ఇంటి బాట ప‌ట్టింది భార‌త జ‌ట్టు. ఇక కాసుల వేట‌లో ఉన్న ఆట‌గాళ్లు సంప్ర‌దాయ ఆట‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేదు.

ప్ర‌ధాన ఆట‌గాళ్లంతా కోట్లు కురిపించే ఐపీఎల్ పై దృష్టి సారిస్తున్నారు. ఇక తాజాగా యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ -2022లో సైతం భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో వైదొల‌గింది.

ఎలాంటి స్టార్లు లేకుండానే శ్రీ‌లంక క‌ప్ ఛాంపియ‌న్ గా నిలిచింది. దీనిపై ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

తాజాగా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్టార్ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్(K Srikanth) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ కప్ లో రాణించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నాడు.

సిడ్నీ అయినా లేదా పెర్త్ అయినా మైదానాల‌న్నీ ఒకేలా ఉంటాయి. ప్ర‌ధానంగా బాల్స్ పైకి లేస్తూ వ‌స్తాయి. ఇలాంటి పిచ్ ల మీద ఆడాలంటే చాలా అనుభ‌వం కావాల్సి ఉంటుంది.

ఇక ప్ర‌యోగాల‌కు పెద్ద పీట వేస్తూ వ‌చ్చిన భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ ఆసిస్ పై ట్రాక్ రికార్డు బాగా ఉన్న సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

శ్రీ‌కాంత్ తో పాటు ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా జ‌ట్టు స‌క్సెస్ పై కొంత అనుమానం వ్య‌క్తం చేశారు. రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్య యాద‌వ్ , పాండ్యా, పంత్ , అశ్విన్ , చాహ‌ల్ , భువీ, బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఆడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : వ‌న్డే కెప్టెన్సీపై వార్న‌ర్ మొగ్గు

Leave A Reply

Your Email Id will not be published!