Kagiso Rabada : గుజ‌రాత్ టైటాన్స్ కు ర‌బ‌డ బిగ్ షాక్

4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు తీసిన స‌ఫారీ

Kagiso Rabada : ఐపీఎల్ 2022లో వ‌రుస గెలుపుల‌తో దూసుకు పోతూ త‌న‌కంటూ ఎదురే లేద‌ని అంచ‌నాల్లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టాడు సౌతాఫ్రికాకు చెందిన స్టార్ పేస‌ర్ క‌గిసొ ర‌బడ‌.

ఒక ర‌కంగా గుజ‌రాత్ ను త‌న బౌలింగ్ తో శాసించాడు. 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన ర‌బ‌డ 4 వికెట్లు తీశాడు. దీంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 142 ర‌న్స్ చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి ఘ‌న విజ‌యం సాధించింది. ఇక కగిసొ ర‌బ‌డ వేసిన బంతుల్ని ఆడేందుకు గుజ‌రాత్ క్రికెట‌ర్లు చాలా ఇబ్బంది ప‌డ్డారు.

ర‌బ‌డ ప్ర‌స్తుతం స‌ఫారీ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. 25 మే 1995లో ద‌క్షిణాఫ్రికా లోని జోహ‌న్నెస్ బ‌ర్గ్ లో పుట్టాడు. ప్ర‌స్తుతం అత‌డి వ‌య‌సు 26 ఏళ్లు. కుడి చేతి వాటం బౌల‌ర్. 2014 నుంచి దక్షిణాఫ్రికా జ‌ట్టుకు ఆడుతున్నాడు.

5 న‌వంబ‌ర్ 2015లో భార‌త్ తో టెస్టు అరంగేట్రం చేశాడు క‌గిసొ ర‌బ‌డ‌(Kagiso Rabada). చివ‌రి టెస్టు 25 ఫిబ్ర‌వ‌రి న్యూజిలాండ్ తో ఆడాడు. 10 జూలై 2015లో బంగ్లాదేశ్ తో వ‌న్డే స్టార్ట్ చేశాడు. 5 న‌వంబ‌ర్ 2014లో ఆస్ట్రేలియాతో టీ20 లో ప్రారంభించాడు క‌గిసొ ర‌బ‌డ‌.

ప్ర‌స్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఆడుతున్నాడు. 22 ఏళ్ల వ‌య‌సులో ఐఈసీ టెస్ట్ బౌల‌ర్ ర్యాంక్సింగ్ రెండింటిలోనూ టాప్ లో ఉన్నాడు.

జూలై 2018లో టెస్టుల్లో 150 వికెట్లు తీసిన అతి పిన్న వ‌య‌స్కుడైన బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు కూడా పొందాడు.

Also Read : పంజాబ్ భ‌ళా గుజ‌రాత్ విల విల

Leave A Reply

Your Email Id will not be published!