Kamal Haasan : అస్వస్థతకు గురైన కమల్ హాసన్
శ్వాస కోశతో ఇబ్బంది పడుతున్న నటుడు
Kamal Haasan : ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోశతో చెన్నై ఆసుప్రతికి వెళ్లారు. జ్వరంతో బాధ పడుతూ చెన్నై లోని ఎస్ఎంఆర్సీ ఆస్పత్రిలో కమల్ హాసన్ హాజరయ్యారు. మెరుగైన చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్బంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. తెలుగు, తమిళ, హిందీ సినిమా రంగంలో కీలకమైన పాత్రలు పోషించారు. మోస్ట్ పాపులర్ నటుడిగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ స్థాపించారు. తాను కూడా పోటీ చేశారు. కానీ గెలువ లేక పోయారు.
అయినా తాను వెనుదిరిగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కమల్ హాసన్(Kamal Haasan) తాను ఇటీవల నటించిన చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు మూవీలో నటిస్తున్నారు. బుధవారం ప్రముఖ సినీ దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ను నివాసంలో కలుసుకున్నారు.
ఆయన ఆశీర్వాదం కూడా పొందారు .ఈ సందర్బంగా తన గురువును తాను కలుసుకున్నానని జీవితం ఆనందమైందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతలోనే శ్వాస కోశతో ఇబ్బందికి గురయ్యారు. దీంతో హుటా హుటిన ఎస్ఎంఆర్సీ ఆస్పత్రికి తరలించారు కమల్ హాసన్ ను.
ఇదిలా ఉండగా కరోనా సమయంలో కమల్ కు కరోనా కు గురయ్యారు. చికిత్స అనంతరం బాగయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6 హోస్ట్ లో బిజీగా ఉన్నారు. కొత్త చిత్రంలో నటిస్తున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కమల్ హాసన్ ఆరోగ్యం బాగుండాలని కోరారు.
Also Read : కీర్తి సురేష్..మెస్సీ హల్ చల్