Kamal Haasan Rahul : రాహుల్ యాత్రలో పాల్గొననున్న కమల్
సంఘీభావం తెలపాలని గాంధీ ఆహ్వానం
Kamal Haasan Rahul : దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ లేఖలు రాశారు. దేశం ఐక్యత కోసం ప్రతి ఒక్కరు తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆహ్వానంతో కూడిన లేఖను పంపించారు. ఇందులో భాగంగా దేశ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటుడు కమల్ హాసన్ కు(Kamal Haasan) కూడా ఆహ్వానం అందింంది.
ఈ మేరకు కమల్ హాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. అనంతరం హర్యానాలోకి ప్రవేశిస్తుంది. ఇదే సమయంలో ఈనెల 24న ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. దాదాపు ఎనిమిది రోజుల విరామం తర్వాత తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ , హర్యానాలోకి ప్రవేశిస్తుంది.
ఇదిలా ఉండగా వచ్చే వారం దేశ రాజధానిలో తలపెట్టిన రాహుల్ యాత్రలో దిగ్గజ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఆయన ఇటీవల తమిళనాడులో పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఏ ఒక్క సీటు రాలేదు. తను కూడా ఓటమి పాలయ్యారు.
కాగా కమల్ హాసన్ పాల్గొనే విషయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ కూడా ధ్రువీకరించింది. తమ అగ్ర నాయకుడు పాల్గొంటారని, రాహుల్ గాంధీకి సంఘీభావం తెలియ చేస్తారని పేర్కొంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ సెప్టెంబర్ 6న తమిళనాడు నుంచి యాత్రను ప్రారంభించారు.
అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో పూర్తయింది.
Also Read : ప్రేక్షకుల ఇష్టం మీకెందుకు కష్టం