Kamal Haasan : ఉదయనిధి కామెంట్స్ సబబే – కమల్
సనాతన ధర్మం పెరియార్ చెప్పిందే
Kamal Haasan : తమిళనాడు – ప్రముఖ నటుడు లోకనాయకుడిగా ప్రసిద్ది పొందిన కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన నటుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు అండగా నిలిచారు.
Kamal Haasan Supports Udhayanidhi Comments
కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ముఖ్య అతిథిగా హాజరైన కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులను ప్రేమించ లేని మతం ఎందుకని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఆనాడే పెరియార్ రామస్వామి నిలదీశారని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా చెన్నైలో జరిగిన రచయితల సభలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ఈ దేశాన్ని నాశనం చేసిందన్నారు. కులం పేరుతో, మతం పేరుతో విభేదాలు సృష్టిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని పోగొట్టాలన్నది తన లక్ష్యమని ప్రకటించారు.
దీనిపై బీజేపీ, హిందూ మత తత్వ వాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆపై కోర్టులను ఆశ్రయించారు. మరో వైపు యూపీకి చెందిన స్వామీజీ ఏకంగా ఉదయనిధి స్టాలిన్ తలకు వెల కట్టారు. ఆయన తలను తీసుకు వచ్చిన వారికి రూ. 10 కోట్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఉదయనిధికి కమల్ హాసన్ మద్దతు పలకడం చర్చకు దారితీసేలా చేసింది.
Also Read : Sreesanth : సంజూ శాంసన్ ఎవరి మాట వినడు