Kamal Haasan : కర్ణాటకలో చోటు చేసుకున్న వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా స్పందించారు.
ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan )ట్విట్టర్ వేదికగా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం పేరుతో, ఆచారాల పేరుతో విద్యకు దూరం చేయడం సబబు కాదని పేర్కొన్నారు.
ఇలాంటివి చెలరేగడం దేశానికి మంచిది కాదని సూచించారు. చదువుకునే వారి మధ్య ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమన్నారు కమల్ హాసన్(Kamal Haasan ). కర్ణాటకలో చెలరేగిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకడం సబబు కాదన్నారు.
మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వివాదం మరింత ముదరడం, పరిస్థితి అదుపు తప్పడంతో కర్ణాటక ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.
ఈ మేరకు మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీనిపై సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయాలని సూచించింది రాష్ట్ర హైకోర్టు.
ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తోంది. ఇదిలా ఉండగా కేవలం ఎన్నికల సమయంలోనే మత విద్వేషాలకు పాల్పడుతూ బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందంటూ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ సాక్షిగా విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. కర్ణాటకలో బీజేపీ ఎందుకు కంట్రోల్ చేయలేక పోయిందని మండిపడ్డాయి.
Also Read : 14న ‘సర్కారు వారి పాట’ అప్ డేట్