Kamya Punjabi : ఎవరీ కామ్యా పంజాబీ ఏమిటా కథ
రాహుల్ యాత్రలో మెరిసిన తార
Kamya Punjabi : దేశానికి కావాల్సింది మతం కాదు మానవత్వం కావాలని, విద్వేషాలను పక్కన పెడదాం ప్రేమను పంచుకుందాం అనే నినాదంతో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇదే సమయంలో ఆయన చేపట్టిన యాత్రలో కామ్యా పంజాబీ తళుక్కున మెరిశారు.
ఆమె అడుగులో అడుగులు వేశారు. రాహుల్ గాంధీకి జతగా కొన్ని కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కామ్యా పంజాబీ వైరల్ గా మారారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. కామ్యా పంజాబీ వయస్సు 43 ఏళ్లు. ఆగస్టు 13, 1979లో పుట్టారు.
1996 నుండి అటు బుల్లి తెరతో పాటు ఇటు సినీ రంగంలో కూడా తనదైన ముద్ర కనబర్చారు. పలు పేరొందిన యాడ్స్ లలో కూడా నటించింది. 2013లో బిగ్ బాస్ -7లో పార్టిసిపేట్ చేసింది. అక్టోబర్ 27, 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరింది కామ్యా పంజాబీ(Kamya Punjabi). రేత్ , అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహానీ, బానూ మే తేరీ దుల్హన్ వటి భారతీయ టెలివిజన్ ధారావాహికలలో పంజాబీ నెగటివ్ పాత్రలు పోషించినందుకు పేరొందారు.
పియా కా ఘర్ , మర్యాద, లేకిన్ కబ్ తప్ , క్యున్ హోతా హై ప్యార్ లో కూడా పంజాబీ సానుకూల పాత్రలు పోషించింది. సోనీ టీవీలో కామెడీ సర్కస్ కామెడీ షోతో పాటు కలర్స్ టీవీలో బిగ్ బాస్ 7లో పాల్గొంది. ఇక కహో నా ప్యార్ హై, నా తుమ్ జానో నా హమ్ , యాదీన్ , ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ , కోయి మిల్ గయా వంటి బాలీవుడ్ చిత్రాలలో కామ్యా పంజాబీ అతిథి పాత్రలలో నటించింది .
1997లో ఆమె మెహందీ మెహందీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అనామిక రూపొందించిన కాలా షా కాలా అనే మ్యూజిక్ వీడియలో పార్టిసిపేట్ చేసింది కామ్యా పంజాబీ(Kamya Punjabi). 2003లో బంటీ నేగిని పెళ్లి చేసుకుంది. 2013లో విడాకులు తీసుకున్నారు. కరణ్ పటేల్ తో డేటింగ్ చేసింది . 2015లో విడి పోయారు. 2020లో డాక్టర్ శలభ్ డాంగ్ ను పెళ్లి చేసుకున్నారు.
పలు అవార్డులు కూడా అందుకున్నారు. మొత్తంగా కామ్యా పంజాబీ వైరల్ గా మారడం విశేషం.
Also Read : సిద్దరామయ్యను ప్రజలు క్షమించరు – బొమ్మై