Kangana Ranaut : బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్న ఆమె తాజాగా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ విషయంపై స్పందించారు.
ఆమెతో పాటూ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా ఫైర్ అయ్యారు. బయట ఎక్కడైనా మీ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉండవచ్చని కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న రూల్స్ ను కచ్చితంగా పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
తమకు హిజాబ్ ఉండాలంటూ ఆందోళన బాట పట్టిన ముస్లిం యువతులు, స్టూడెంట్స్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక (Kangana Ranaut )వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే బురఖా లేకుండా ఆఫ్గనిస్తాన్ లో తిరిగి చూడాలని సవాల్ విసిరారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హిజాబ్ లేకుండా తిరిగే పరిస్థితి అక్కడ లేదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఇస్తున్న ఏకైక దేశం తమదేనని స్పష్టం చేశారు కంగనా రౌనౌత్. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఆనంద్ రంగనాథన్ షేర్ చేసిన పోస్ట్ ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. కావాలని అనుకుంటే విద్యాలయాలు మినహా ఇంకెక్కడైనా మీకు ఇష్టం వచ్చిన రీతిలో దుస్తులు ధరించ వచ్చని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది.
కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో దానిని వివాదం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కంగనా రనౌత్. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
Also Read : నెట్టింట్లో ‘బేకాబూ’ సాంగ్ హల్ చల్