Kangana Ranaut : కంగ‌నా నోట య‌శ్..బ‌న్నీ మాట

ఆకాశానికి ఎత్తేసిన ముద్దుగుమ్మ

Kangana Ranaut : వివాదాస్ప‌ద బాలీవుడ్ న‌టిగా పేరొందిన కంగ‌నా ర‌నౌత్ ఉన్న‌ట్టుండి సౌత్ ఇండియా స్టార్స్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఏది మాట్లాడినా లేదా ఏ పోస్టు చేసినా ఇంకేదైనా కామెంట్ చేసినా అది పూర్తిగా కాంట్రోవ‌ర్సీస్ కు దారి తీస్తుంది.

దీంతో కంగ‌నా అంటేనే వివాదాల‌కు కేరాఫ్ గా మారి పోయింది. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువ‌గా దేశానికి సంబంధించిన అంశాల‌పై వ్యాఖ్యానించ‌డం. ఆ త‌ర్వాత వ్య‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డం. కేసులు, ఫిర్యాదులు వెల్లువెత్త‌డం ప‌రిపాటిగా మారింది.

తాజాగా ఈ వివాద‌స్ప‌ద న‌టి ద‌క్షిణాదిలో టాప్ స్టార్లుగా ఉన్న కేజీఎఫ్ సూప‌ర్ హీరో య‌శ్, పుష్ప రాజ్ తో పాన్ ఇండియా హీరోగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

బాలీవుడ్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, అక్క‌డి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. ఒక ర‌కంగా సుతిమెత్త‌గా కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut)హెచ్చ‌రించింది. ఆమె ముందు నుంచీ బాలీవుడ్ పై క‌సి పెంచుకుంది.

త‌న‌కు అవ‌కాశాలు రాకుండా చేసిన ఆ సినీ రంగం అంటే పిచ్చి కోపం కూడా. మ‌రోసారి ఈ సౌత్ స్టార్స్ కు స‌పోర్ట్ చేస్తూ బాలీవుడ్ ను ఏకి పారేసింది కంగ‌నా ర‌నౌత్. ద‌క్షిణాది సినిమా రంగాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది.

ఈ సంద‌ర్భంగా య‌శ్, అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేసింది. ఇక్క‌డి సినీ న‌టుల‌కు సంస్కృతి, సంప్ర‌దాయాలంటే విప‌రీత‌మైన అభిమాన‌మ‌ని పేర్కొంది.

కుటుంబాల‌కు, రిలేష‌న్ షిప్స్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తారంటూ కితాబు ఇచ్చింది కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut). ప్రొఫెష‌న్ ప‌ట్ల నిబ‌ద్ద‌త గొప్ప‌ద‌ని పేర్కొంది.

Also Read : సినీ రంగంలో ఊర్వ‌శి ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!