Kapil Dev Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫిట్ నెస్ పై అనుమానం

షాకింగ్ కామెంట్స్ చేసిన క‌పిల్ దేవ్

Kapil Dev Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒక జ‌ట్టుకు నాయ‌కుడు అనే వాడు ఆద‌ర్శ ప్రాయంగా ఉండాలి.

ప్ర‌ధానంగా క్రికెట్ జ‌ట్టు వర‌కు వ‌చ్చేస‌రిక‌ల్లా ఇత‌ర ఆట‌గాళ్ల‌ను ముందుండి న‌డిపించ గ‌ల‌గాలి. నిత్యం కెప్టెన్ అయిన‌ప్ప‌టి నుంచి అంత‌కు ముందు కూడా రోహిత్ శ‌ర్మ ప‌దే ప‌దే గాయాల‌కు లోన‌వుతున్నాడు.

అస‌లు ఫిట్ గా ఉన్నాడా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని బాంబు పేల్చాడు క‌పిల్ దేవ్. అయితే రోహిత్ శ‌ర్మ అద్బుత‌మైన బ్యాట‌ర్ అని చెప్ప‌డంలో త‌న‌కు ఎలాంటి సందేహం లేద‌న్నాడు.

కానీ ఫిట్ నెస్ వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా అస‌లు త‌న‌కు డౌట్ క‌లుగుతోంద‌న్నాడు . నిత్యం ఫిట్ నెస్ కార‌ణంగా ప్ర‌ధాన మ్యాచ్ ల‌కు దూరంగా ఉండ‌డం వ‌ల్ల ఎలాంటి మెస్సేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారంటూ బీసీసీఐని ప్ర‌శ్నించాడు.

ఇక‌నైనా రోహిత్ శ‌ర్మ విష‌యంలో ఆలోచించాల‌ని సూచ‌న చేశాడు. ఎవ‌రైనా బ‌ల‌మైన ఆట‌గాడు కెప్టెన్ గా ఉండాల‌ని అనుకుంటాడ‌ని కానీ ప‌దే ప‌దే గాయాల బారిన ప‌డే వాళ్ల‌ను కావాల‌ని కోరుకోర‌న్నాడు క‌పిల్ దేవ్(Kapil Dev Rohit Sharma).

ఇదిలా ఉండ‌గా ఫిట్ నెస్ స‌మ‌స్య‌తో శ్రీ‌లంకతో జ‌రిగిన టీ20 సీరీస్ కు దూర‌మ‌య్యాడు రోహిత్ శ‌ర్మ‌. మ‌రో వైపు హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు శ్రీ‌లంక‌తో సీరీస్ నెగ్గింది. త్వ‌ర‌లో వ‌న్డే సీరీస్ ప్రారంభం కానుంది.

ఈ త‌రుణంలో రోహిత్ శ‌ర్మ తాను పూర్తి ఫిట్ గా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో క‌పిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం తో విస్తు పోయాడు రోహిత్ శ‌ర్మ‌. జ‌ట్టుకు బ‌ల‌మైన నాయ‌కుడు కావాల‌ని స్ప‌ష్టం చేశాడు నిఖంజ్.

Also Read : క‌దం తొక్కిన సూర్యా భాయ్

Leave A Reply

Your Email Id will not be published!