Kapil Dev : వేగం బౌలింగ్ కు ప్రామాణికం కాదు

ఉమ్రాన్ మాలిక్ పై క‌పిల్ దేవ్ కామెంట్

Kapil Dev  : ఐపీఎల్ 2022లో ఒకే ఒక్కడి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఆ ఒక్క‌డు ఎవ‌రో కాదు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌మ్మూ కాశ్మీర్ కు చెందిన స్టార్ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్. గంట‌కు 153 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ స‌త్తా చాటుతున్నాడు.

గ‌త ఏడాది హైద‌రాబాద్ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే ఈసారి దుమ్ము రేపుతోంది. కంటిన్యూగా గెలుస్తూ పోతోంది. ఉమ్రాన్ మాలిక్ ను వెంట‌నే భార‌త క్రికెట్ జ‌ట్టుకు తీసుకోవాల‌ని మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ డిమాండ్ చేశారు.

ప్ర‌తి ఒక్క‌రు ఉమ్రాన్ మాలిక్ వేగం గురించి మాట్లాడుతున్నారు. దీనిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్. బౌల‌ర్ కు ఉండాల్సింది వేగంతో పాటు బంతుల్ని క‌రెక్ట్ గా కంట్రోల్ లో ఉంచు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు.

ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడ‌ని కానీ అదే స‌మ‌యంలో బంతుల్ని నియంత్ర‌ణ‌లో ఉండేలా చూసు కోవాల‌ని సూచించాడు. పేస‌ర్ కు ఉండాల్సింది వేగంతో పాటు ఖ‌చ్చిత‌త్వం, వికెట్ల వ‌ద్ద‌కు వ‌చ్చేలా బంతులు వేసేలా చూడాల‌న్నాడు.

ఇర్ఫాన్ ప‌ఠాన్, ర‌షీద్ ల‌తీఫ్ , సునీల్ గ‌వాస్క‌ర్ , ర‌విశాస్త్రి త‌దిత‌ర ఆట‌గాళ్లు ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ క‌పిల్ దేవ్ (Kapil Dev )మాత్రం ఎంత కాలం వేగం ప‌ని చేయ‌ద‌ని చెప్పాడు. పేస్ ముఖ్యం కాదు. పేస్ తో పాటు నిల‌క‌డ‌గా బౌలింగ్ చేయ‌డం ప్ర‌ధాన‌మ‌న్నాడు

Also Read : విజ్డెన్ ఐదుగురు క్రికెట‌ర్ల‌లో రోహిత్..బుమ్రా

Leave A Reply

Your Email Id will not be published!