Kapil Dev : కోహ్లీ ఎంత త‌గ్గితే అంత మంచిది

ఇగోను ప‌క్క‌న పెట్టాల‌ని సూచ‌న‌

Kapil Dev : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్(Kapil Dev) మొద‌టి నుంచీ భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీపై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇటీవ‌ల త‌న‌ను తొల‌గించే విష‌యం సెలెక్ట‌ర్లు చెప్ప‌లేదంటూ విరాట్ చేసిన కామెంట్స్ పై కూడా సీరియ‌స్ అయ్యారు క‌పిల్ దేవ్.

ముంద‌స్తు స‌మాచారం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు. ప‌నిలో ప‌నిగా కోహ్లీపై నిప్పులు చెరిగాడు హ‌ర్యానా హ‌రికేన్. కోహ్లీకి పొగురు ఎక్కువ అని దానిని ఎంత త‌గ్గించుకుంటే అంత మంచిద‌ని సూచించాడు.

టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో తాజా, మాజీ దిగ్గ‌జ ఆట‌గాళ్లు కోహ్లీకి అండ‌గా కొంద‌రు నిలిస్తే మ‌రికొంద‌రు ఇప్పుడే ఎందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

మ‌రో వైపు వ‌ద్ద‌న‌క ముందే త‌ప్పుకోవ‌డం బెట‌ర్ అని వివాద‌స్ప‌ద కామెంటేట‌ర్ మంజ్రేక‌ర్ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ఈ త‌రుణంలో క‌పిల్ దేవ్ (Kapil Dev)కోహ్లీ ఇక నుంచీ అన్నింట‌నీ ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ల సార‌థ్యంలో సైతం ఆడేందుకు ప్ర‌య్న‌తం చేయాల‌న్నాడు.

తాను కూడా త‌న కంటే చిన్న వాళ్ల‌యిన క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్, హైద‌రాబాద్ స్టార్ ప్లేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ సార‌థ్యంలో ఆడాన‌ని గుర్తు చేశాడు క‌పిల్ దేవ్. ఆట అన్నాక చిన్నా పెద్దా అన్న తేడా ఉండ‌ద‌ని అది ముందు కోహ్లీ గుర్తించాల‌ని సూచించాడు.

కోహ్లీ నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపాడు. బ్యాట‌ర్ గా మునుప‌టి ఉత్సాహం, క‌సి క‌నిపించ‌డం లేద‌న్నాడు. రిజైన్ చేసి మంచి ప‌ని చేశాడ‌న్నాడు.

గ‌వాస్క‌ర్ లాంటి సీనియ‌ర్ కూడా నా సార‌థ్యంలో ఆడాడ‌ని చెప్పాడు క‌పిల్ దేవ్. ఇక‌నైనా అన్నింటినీ మ‌రిచి పోయి ఇగోను ప‌క్క‌న పెట్టి ఆట‌పై ఫోక‌స్ పెట్టాల‌న్నాడు.

Also Read : వ‌ద్ద‌న‌క ముందే త‌ప్పుకోవ‌డం బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!