Kapil Sibal : సీబీఐ దాడులపై కపిల్ సిబల్ కామెంట్స్
అరవింద్ కేజ్రీవాల్ కు మరింత క్రేజ్
Kapil Sibal : కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు 14 మంది ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చింది.
సిసోడియాకు చెందిన ఫోన్ , కంప్యూటర్లను సీజ్ చేసింది. ఈ సందర్భంగా కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాడుల నేపథ్యంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరింత మైలేజీ దక్కింది. ఒక రకంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తనంతకు తానే అస్థిరతను కోరుకుంటున్నట్లు తనకు అనిపిస్తోందని పేర్కొన్నారు.
వ్యక్తులను టార్గెట్ చేయడం అన్నది పరిపాటిగా మారిందంటూ ఆరోపించారు. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను టార్గెట్ చేసింది కేంద్రం. ఇప్పుడు మనీష్ సిసోడియాను లక్ష్యంగా చేసుకుంది.
గత ఏడాది 2021 నవంబర్ లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఏడు రాష్ట్రాలలో సోదాలు జరిపింది.
ఈ దాడుల అనంతరం స్పందించారు సోసిడియా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సత్యం తన వైపే ఉందన్నారు. ఎన్ని దాడులు జరిపినా పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తూనే ఉంటామన్నారు.
మంచి పనులు చేసే వారిని ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే దేశం నెంబర్ 1 కాలేదన్నారు. మరో వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
విచారణకు సహకరిస్తాం. గతంలో దాడులు చేశారు. ఎలాంటి ఆధారాలు లభించ లేదు. ఇప్పుడు కూడా దొరకవన్నారు.
Also Read : భారీగా ఐఏఎస్ లకు స్థాన చలనం