Karan Johar : బాలీవుడ్ కు ఢోకా లేదు – క‌ర‌ణ్ జోహార్

సౌతిండియా సినామాల ప్ర‌భావం లేదు

Karan Johar : భార‌త దేశంలో సినిమా అంటేనే బాలీవుడ్ పేరు ముందు వినిపించేది. త‌ర్వాత మిగతా సౌత్, నార్త్ ఇండ‌స్ట్రీస్ పేర్లు ఉండేవి. కానీ సీన్ మారింది. గ‌త రెండు మూడేళ్ల నుంచి సౌత్ ఇండియా మూవీస్ దుమ్ము రేపుతున్నాయి.

ప్ర‌ధానంగా బాహు బ‌లి, కేజీఎఫ్‌, పుష్ప‌, స‌ర్కార్ వారి పాట‌..ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి మూవీ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో బాలీవుడ్ సౌతిండియా సినిమాల దెబ్బ‌కు ఠారెత్తి పోతోంది.

బాక్సాఫీసుల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీలు సృష్టిస్తున్నాయి మూవీస్. దీంతో బాలీవుడ్ క‌థ కంచికి చేరింద‌ని ఖేల్ ఖ‌త‌మ‌ని కామెంట్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

దీనిపై తాజాగా స్పందించాడు బాలీవుడ్ నిర్మాత, ప్ర‌జెంట‌ర్ క‌ర‌ణ్ జోహార్(Karan Johar). పుష్ప‌, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌2 , స‌ర్కార్ వారి పాట దండ‌యాత్ర చేసింది వాస్త‌వ‌మే.

కోట్లు కూడా కొల్ల‌గొట్టాయి కాద‌న‌లేం. కానీ ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన హిందీ మూవీస్ కూడా బాగా ఆడాయంటూ పేర్కొన్నాడు. బాలీవుడ్ కు ఢోకా అన్న‌ది లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

సినిమాల‌కు ఎప్ప‌టికీ ఢోకా అన్న‌ది ఉండ‌దు. మంచి సినిమాలు, కంటెంట్ ఉన్న మూవీస్ ను జ‌నం ఆద‌రిస్తారు. అవి హిందీనా లేక తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళం అని చూడ‌ర‌ని అన్నారు క‌ర‌ణ్ జోహార్.

ఇటీవ‌ల విడుద‌లైన జుగ్ జుగ్ జియో రూ. 84 కోట్లు, గంగూబాయి క‌తియావాడి రూ. 180 కోట్లు భూల్ భులాయా 2 రూ. 250 కోట్లు కొల్ల‌గొట్టింద‌ని తెలిపాడు క‌ర‌ణ్ జోహార్. ఇదే స‌మ‌యంలో స‌ల్మాన్ అంతిమ్ , ర‌న్ వే , సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీస్ బోర్లా ప‌డ్డాయి.

Also Read : ర‌ణ్ వీర్ సింగ్ కి జాన్వీ క‌పూర్ స‌పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!