Karnataka Chief Minister Comment : స‌యోధ్య కొన‌సాగేనా పాల‌న సాగేనా

సీఎం పంచాయ‌తీ ఇప్ప‌ట్లో తీరేనా

Karnataka Chief Minister Comment : క‌ర్ణాట‌క సీఎం ఎవ‌ర‌నేది తేలిపోయింది. నాలుగు రోజుల ఉత్కంఠ‌కు తెర ప‌డింది. నువ్వా నేనా అంటూ సాగిన వ్య‌వ‌హారం చివ‌ర‌కు సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ సీఎం(Chief Minister) పోస్టును పంచుకునేలా ఏఐసీసీ స‌యోధ్య కుదిర్చింది. ఇద్ద‌రూ ఉద్దండులే. అనుభవం క‌లిగిన నాయ‌కులే. క్లీన్ ఇమేజ్ క‌లిగిన సిద్ద‌రామ‌య్య ఓ వైపు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డీకే శివ‌కుమార్ ఇరు వ‌ర్గాల‌కు విడి పోయారు. మ‌రో వైపు ద‌ళితుల‌కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల‌నే డిమాండ్ పెరిగింది. దీనికి సంబంధించి మాజీ సీఎం 71 ఏళ్ల జి. ప‌ర‌మేశ్వ‌ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. త‌మ వాళ్ల ఓట్లు కూడా పార్టీకి వేశార‌ని, అభ్య‌ర్థుల‌ను గెలిపించార‌ని పేర్కొన్నారు.

ఈ త‌రుణంలో ఏం జ‌రుగుతుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. సిద్ద‌రామ‌య్య సీఎం(Chief Minister) కాబోతున్నారు. డీకే శివ‌కుమార్ కీల‌కంగా మార‌నున్నారు. ఆయ‌న డిప్యూటీ సీఎంతో పాటు కీల‌క‌మైన మంత్రుల శాఖ‌ల‌ను త‌న వారికి ఇచ్చేలా ఒప్పందం కుదిరిన‌ట్లు స‌మాచారం. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నాట‌క నుంచి 20 లోక్ స‌భ సీట్ల‌ను గెలిపించాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్. ఇదే స‌మ‌యంలో ఆయ‌నే పార్టీని న‌డుపుతారంటూ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఇది ప‌క్క‌న పెడితే ఇద్ద‌రు నేత‌ల‌ను ఒప్పించేందుకు నానా తంటాలు ప‌డింది పార్టీ హైక‌మాండ్.

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తో పాటు మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చివ‌రి వ‌ర‌కు చేసిన ప్ర‌యత్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివ‌ర‌కు ఆఖ‌రి అస్త్రాన్ని ప్ర‌యోగించింది కాంగ్రెస్ పార్టీ. ప‌రిస్థితి చేయి దాటి పోతుంద‌ని గ‌మ‌నించారు మేడం సోనియా గాంధీ. ఆమెనే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆమె అంటే డీకే శివ‌కుమార్ కు ఎన‌లేని అభిమానం. అంతకు మించిన గౌర‌వం కూడా. విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ సిద్ద‌రామ‌య్య వైపు మొగ్గితే సోనియా గాంధీ డీకే శివ‌కుమార్ వైపు నిలిచారు. చివ‌ర‌కు ఒక‌రు సీఎం మ‌రొక‌రు డిప్యూటీ సీఎం పంచుకునేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. సిద్ద‌రామ‌య్య 2 ఏళ్ల పాటు సీఎంగా కొన‌సాగుతారు. 3 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు.

పైకి స‌యోధ్య కుదిరినా లోలోప‌ట ఆధిప‌త్య పోరు కొన‌సాగడం ఖాయం. పార్టీ స‌యోధ్య కుదిర్చినా ఇంకా కేబినెట్ కూర్పు మిగిలి ఉంది. ఇద్ద‌రూ ఎలా నెట్టుకు రాగ‌ల‌ర‌నేది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మారింది. అయితే అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది మాత్రం డీకే శివ‌కుమార్. అన్నింటినీ ఆయ‌న చూసుకున్నారు. ముందుండి న‌డిపించారు. విజ‌యం సిద్దించేలా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఏది ఏమైనా సిద్ద‌రామ‌య్య , డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య స‌యోధ్య కంటిన్యూ అవుతుందా పాల‌నా ప‌రంగా ప్ర‌భావం చూప‌నుందా అన్న‌ది త‌ల‌కు మించిన భారంగా మారింది పార్టీకి. ఏది ఏమైనా ప్ర‌జ‌లు భారీ ఎత్తున మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. కానీ ఒక్క పోస్టుకే ఇలా విడిపోవ‌డాన్ని క‌న్న‌డ‌వాసులు జీర్ణించు కోలేక పోతున్నారు.

Also Read : KTR

 

Leave A Reply

Your Email Id will not be published!