JP Nadda : జేపీ న‌డ్డాకు కోలుకోలేని దెబ్బ

అధికారానికి దూర‌మైన బీజేపీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా త్ర‌యానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. రెండోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. వేల కోట్ల రూపాయ‌లు మంజూరు చేసినా, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నీ తానై ప్ర‌చారం చేసినా చివ‌ర‌కు కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేక పోయారు.

క‌న్న‌డ నాట మీ వ్యూహాలు ప‌ని చేయ‌వంటూ ప్ర‌క‌టించారు. ఓట‌ర్లు త‌మ తీర్పు చెప్పారు. ఇది ఒక ర‌కంగా గెలుపు బాటలో దూసుకు పోతున్న బీజేపీకి ఇది ఒక ర‌కంగా కోలుకోలేని దెబ్బ‌. 40 శాతం క‌మీష‌న్ , అవినీతి అక్ర‌మాలు, స్కాంలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ప్ర‌జ‌లు విసిగి వేసారి పోయారు బొమ్మై పాల‌న ప‌ట్ల‌. చివ‌ర‌కు కాంట్రాక్ట‌ర్లు స్వ‌యంగా ప్ర‌ధానికి లేఖ‌లు రాసినా పట్టించు కోలేదు. రోడ్ షోలు, ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించినా ఆశించిన మేర సీట్లు గెలుచుకోలేక పోయింది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంత్రం ప‌ని చేయ‌లేదు. ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా వ్యూహాలు వ‌ర్క‌వుట్ కాలేదు. జేపీ న‌డ్డా అధ్య‌క్షుడిగా గెలుపు ద‌క్కించు కోలేక పోయారు. రాబోయే ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాండేట్ గా ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని అమిత్ షా భావించారు. కానీ క‌న్న‌డిగులు చెంప ఛెళ్లుమ‌నిపించారు.

Leave A Reply

Your Email Id will not be published!