Karnataka Election Comment : కన్నడ నాట కింగ్ పిన్ ఎవరో
ఎగిరే జెండా ఎవరిదో
Karnataka Election Comment : యావత్ దేశం చూపు కర్ణాటక వైపు నెలకొంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు కొనసాగనుంది. ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం కూడా బరిలోకి దిగాయి.
వీరితో పాటు ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు. కానీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటోంది. ఇక మరోసారి సీరియస్ గా ఫోకస్ పెట్టారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా. ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా నిర్వహించారు.
హామీల జల్లులు కురిపించాయి. ఇరు పార్టీలు విడుదల చేసిన మేని ఫెస్టోలు వివాదాస్పదంగా మారాయి. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించింది కాంగ్రెస్. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది బీజేపీ. దీనినే ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది. బీజేపీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఆ పార్టీకి 40 శాతం కమీషన్ సర్కార్ గా నామకరణం చేసింది. దీనినే ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యింది.
అధికార పార్టీ తరపున సీఎం బొమ్మై ఉన్నా లేనట్టే. ఆయన కేవలం పార్టీ పరంగా నిర్ణయాలు ప్రకటించడం తప్ప చేసింది ఏమీలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ చేశారు. సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో దుమ్ము రేపారు. కర్ణాటకను(Karnataka Election Comment) జల్లెడ పట్టారు.
ఆయనతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా కూడా మాటలతో మంటలు రేపారు. ఇక ఆ పార్టీ నుంచి కొందరు సీనియర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇది ఒక రకంగా మైనస్ అని చెప్పక తప్పదు. ఈసారి బీఎస్ యడ్యూరప్ప ప్రభావం అంతగా కనిపించ లేదు. కానీ ఆయన కూడా తనదైన రీతిలో ప్రచారం చేపట్టారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ జల్లెడ పట్టారు. విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చేలా చేసింది.
తాము పవర్ లోకి వస్తే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం, నిరుద్యోగులకు భృతి, మహిళలకు ఉపాధి, రుణాల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక జనతాదల్ ఎస్ చీఫ్ , మాజీ సీఎం కుమార స్వామి అన్నీ తానై ప్రచారం చేపట్టారు. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 10న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు రాబోతున్నాయి(Karnataka Election Comment). ఈసారి లింగాయత్ లు ఎటు వైపు మొగ్గుతారో తేలాల్సి ఉంది. హంగ్ రాబోతుందా లేక రెండోసారి బీజేపీ పవర్ లోకి వస్తుందా లేదా కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అన్నది వేచి చూడాలి.
Also Read : అమరుల త్యాగం ఫలించలేదు