CM Bommai : కార్యకర్త కుటుంబానికి సర్కార్ భరోసా
ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం బొమ్మై
CM Bommai : కర్ణాటక రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన భారతీయ యువజన మోర్చా కార్యకర్త ప్రవీణ్ నట్టారు (32) కుటుంబానికి భరోసా కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(CM Bommai). మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి సర్కార్ తరపున రూ. 25,00,000 లక్షలు , భారతీయ జనతా పార్టీ పరంగా రూ. 25,00,000 లక్షలు ఆర్థిక సాయం అందజేశామన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు సీఎం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది.
బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, తదితర శ్రేణులన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బసవరాజ్ బొమ్మై(CM Bommai) దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
పరామర్శించేందుకు వెళ్లేందుకు వెళ్లిన బీజేపీ చీఫ్ ను కొట్టినంత పని చేశారు. ప్రవీణ్ నెట్టారు ను హత్య చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా అవసరమైతే కర్ణాటకలో యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ అమలు చేస్తున్న బుల్డోజర్ల మోడల్ ను అమలు చేస్తామన్నారు సీఎం.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదిలా ఉండగా బొమ్మై సీఎంగా కొలువు తీరి ఏడాది పూర్తయింది. బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసి మూడేళ్లవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్సవాలను కార్యకర్త హత్యకు నివాళిగా రద్దు చేసినట్లు ప్రకటించారు సీఎం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. నిందితుల్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటున్నారు పోలీసులు.
Also Read : అధిర్ రంజన్ కు మహిళా కమిషన్ నోటీసులు