karnataka Govt : 40 శాతం కమీషన్ పై న్యాయ విచారణ
ఆదేశించిన సీఎం సిద్దరామయ్య
karnataka Govt : మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మైకి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు సీఎం సిద్దరామయ్య. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రానికి ఝలక్ ఇచ్చే పనిలో పడ్డారు సీఎం. ఈ మేరకు రాష్ట్రంలో గతంలో కొలువు తీరిన బొమ్మై సర్కార్ చేసిన స్కామ్ లు, తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, ఇతర అవినీతి, అక్రమాల చిట్టాపై ఫోకస్ పెట్టారు.
karnataka Govt Commission Viral
ఈ మేరకు బొమ్మై ప్రభుత్వానికి ఏకంగా 40 శాతం కమీషన్ అన్న పేరు వచ్చింది. దీనినే ప్రధాన అంశంగా చేర్చింది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. దీనినే ప్రచార అస్త్రంగా మార్చుకుని జనం నుంచి ఓట్లు పొందింది. దీంతో మొత్తం 224 సీట్లకు గాను 135 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీకి 64 సీట్లు రాగా జేడీఎస్ 19 సీట్లకే పరిమితం అయ్యింది.
దీంతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు సీఎం. గత బీజేపీ హయాంలో జరిగిన 40 శాతం కమీషన్ స్కామ్ పై కర్ణాటక సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది.
Also Read : YS Sharmila : దళిత ద్రోహి కేసీఆర్ – షర్మిల