Dil Raju Narang : జైల‌ర్ స‌క్సెస్ తో దిల్ రాజు..నారంగ్ హ్యాపీ

బ‌ల‌గంతో నిర్మాత‌కు మంచి పేరు

Dil Raju Narang : టాలీవుడ్ లో దిల్ రాజు గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. మంచి క‌థ ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పే ద‌మ్మున్న నిర్మాత‌. ఆయ‌న క‌మెడియ‌న్ వేణును న‌మ్మి తీసిన బ‌ల‌గం ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అవార్డుల‌లో రికార్డు సృష్టించింది. ఇక తాజాగా ఆయ‌న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ న‌టించిన జైల‌ర్ ను తెలుగులో డిస్ట్రిబ్యూష‌న్ చేసేందుకు తీసుకున్నాడు.

Dil Raju Narang Takes Jailer AP Distribution

దీనిని రూ. 12 కోట్ల‌కు అమ్మారు. ఇక ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి తో మెహ‌ర్ ర‌మేష్ తీసిన భోళా శంక‌ర్ బిగ్ డిజాస్ట‌ర్ గా మిగిలి పోయింది. రూ.140 కోట్లు పెట్టి తీసిన నిర్మాత‌ అనిల్ సుంక‌ర‌కు త‌డిగుడ్డ మిగిలింది. కేవలం రూ. 24 కోట్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్టు టాక్.

ఇదే స‌మ‌యంలో 72 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ర‌జనీకాంత్ , త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ క‌లిసి చేసిన జైల‌ర్(Jailer) రికార్డుల మోత మోగించింది. కేవ‌లం 7 రోజుల్లోనే రూ. 450 కోట్ల మార్క్ దాటేసింది. సూప‌ర్ స్టార్ సినీ కెరీర్ లో జైల‌ర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. త‌మిళం, తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో దీనిని విడుద‌ల చేశారు. బాక్సులు క‌లెక్ష‌న్ల‌తో నిండి పోతున్నాయి.

ఇంకెన్ని కోట్లు క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతుందో చెప్పలేం అంటున్నారు సినీ ట్రేడ‌ర్స్. ఇక తెలుగులో రూ. 12 కోట్ల‌కు తీసుకుంటే 2 రోజుల్లోనే ఆ డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు టాక్. ప్ర‌స్తుతం రూ. 30 కోట్లు దిల్ రాజు, నారంగ్ కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Also Read : karnataka Govt : 40 శాతం క‌మీష‌న్ పై న్యాయ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!