Liquor Shops Comment : మ‌ద్యం కోసం ద‌ర‌ఖాస్తుల ప్ర‌వాహం

రికార్డు స్థాయిలో ల‌క్ష‌కు పైగానే అప్లికేష‌న్స్

Liquor Shops Comment : ఎటుపోతోంది తెలంగాణ అర్థం కావ‌డం లేదు. మ‌ద్యానికి బార్లా గేట్లు తెరిచిన ఘ‌న‌త సీఎం కేసీఆర్(KCR) కే ద‌క్కుతుంది. మ‌ద్యం కోట్లాది కుటుంబాల‌ను నాశ‌నం చేస్తోంది. ల‌క్ష‌లాది మ‌హిళ‌ల తాళిల‌ను తెంచుతోంది. అయినా మ‌ద్యం కోసం నిస్సిగ్గుగా స‌ర్కార్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇది స‌భ్య స‌మాజం త‌ల దించు కోవాల్సిన ప‌రిస్థితి. ఓ వైపు బంగారు తెలంగాణ అంటూ ఇంకో వైపు ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకుంటూ పోతుంటే అడిగే నాథుడే క‌రువ‌య్యారు. కోర్టు చీవాట్లు పెట్టినా చీమ కుట్ట‌డం లేదు. ఓ వైపు నిరుద్యోగులు నానా తంటాలు ప‌డుతున్నారు. కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియ‌దు. స‌ర్కార్ పాల‌న ఫామ్ హౌస్ కే ప‌రిమితై పోయింద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు.

Liquor Shops Comment Viral

ఈ త‌రుణంలో రిటైర్డు ఉద్యోగుల హ‌వా కొన‌సాగుతుండ‌డం రాష్ట్రానికి శాపంగా మారింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల రూపంలో ప్ర‌జ‌ల సొమ్ము ప‌రుల పాల‌వుతున్న‌ది. ప్ర‌శ్నిస్తే నేరంగా మారింది. ఈ త‌రుణంలో తాజాగా ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌నకు ఊహించ‌ని రీతిలో స్పంద‌న ల‌భించింది. ఆ ప్ర‌క‌ట‌న ఏదో ఉద్యోగాల కోస‌మో లేదా కొత్త కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన‌దో లేదా కొత్త విశ్వ విద్యాల‌యం అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఉన్న మ‌ద్యం దుకాణాల‌తో పాటు మ‌రికొన్ని దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తుల కోసం ముంద‌స్తు డిక్లేర్ చేసింది.

వీధికో పాఠ‌శాల ఉండాల్సిన ఈ రాష్ట్రంలో గ‌ల్లీకో మ‌ద్యం దుకాణం వెలిసింది. ఎక్క‌డ చూసినా మందు బాబులే. నిత్యం కేసులే. వేధింపులే. తాగుతూ, తుళ్లుతూ యువ‌త జోగుతోంది. ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నా ఎవ‌రూ అటు వైపు చూడ‌డం లేదు. ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటోంది భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయ‌ని. ఎక్క‌డా చూడ‌లేదు. స‌ర్కారే మ‌ద్యం అమ్మ‌కానికి సంబంధించిన ద‌ర‌ఖాస్తుదారుల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ బ్యానర్లు క‌ట్టడం. ఇక బార్లు బార్లా తెరుచుకుంటున్నాయి. ప‌బ్ ల‌కు కొద‌వ‌లేదు. ఫామ్ హౌస్ లలో తుళ్తుతూ తూలుతూ రాజ‌కీయాలు చేస్తూ సాగుతోంది తెలంగాణ‌.

తాజాగా రాష్ట్రంలో మ‌ద్య షాపుల‌కు ద‌ర‌ఖాస్తులు ఏకంగా ల‌క్ష కు పైగా రావ‌డం విస్తు పోయేలా చేస్తోంది. 2021-23 కు సంబంధించి టెండ‌ర్ల కాల ప‌రిమితి న‌వంబ‌ర్ తో ముగుస్తుంది. దీంతో మూడు నెల‌ల ముందుగానే 2023-25 కాల ప‌రిమితికి సంబంధించి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. శుక్ర‌వారంతో గ‌డువు ముగుస్తుండ‌డంతో బారులు తీరారు..క్యూ కట్టారు..ఇంకొంద‌రు ప‌రుగులు తీశారు. శంషా బాద్, సూరూర్ న‌గ‌ర్ , న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో అత్య‌ధిక ద‌ర‌ఖాస్తులు రావ‌డం దేనికి సంకేత‌మో స‌ర్కార్ ఆలోచించాలి. ఇందులో రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీ కూడా చేర్చారు. స‌మాజానికి ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన జిల్లా క‌లెక్ట‌ర్లు ఇప్పుడు మ‌ద్యం షాపులను కేటాయించే క‌మిటీల‌కు నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఇది దౌర్భాగ్యం కాక పోతే ఇంకేంటి.

Also Read : Dil Raju Narang : జైల‌ర్ స‌క్సెస్ తో దిల్ రాజు..నారంగ్ హ్యాపీ

Leave A Reply

Your Email Id will not be published!