V Somanna Slaps : కర్ణాటక మంత్రి నిర్వాకం సర్వత్రా ఆగ్రహం
మహిళపై చేయి చేసుకున్న మంత్రిపై ఫైర్
V Somanna Slaps : రోజు రోజుకు దేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వైపు భారతీయ సంస్కృతి, సంప్రదాయం అంటూ గొంతు చించుకునే బీజేపీ దాని అనుబంధ సంస్థలన్నీ మహిళల పట్ల మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుజరాత్ లో దారుణ అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడం పై నిరసన వ్యక్తం అవుతోంది. మరో వైపు విద్వేష పూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ తరుణంలో కర్ణాటక భారతీయ జనతా పార్టీకి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి వి. సోమన్న(V Somanna Slaps) ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
వెంటనే మహిళకు క్షమాపణ చెప్పాలని , సీఎం రాజీనామా చేయాలని, పార్టీ నుంచి మంత్రి సోమన్నను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రిలను నిలదీశారు ఆ పార్టీకి చెందిన అగ్ర నేత రణ్ దీప్ సూర్జేవాలా. జనతాదళ్ ఎస్ నాయకుడు తన్వీర్ అహ్మద్ తీవ్ర స్థాయిలో వి. సోమన్న నిర్వాకంపై మండిపడ్డారు.
ఇలాంటి వ్యక్తులను కేబినెట్ లో ఉంచకుండా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మహిళా లోకానికి అవమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక సీఎం ఈ వ్యవహారంపై ఇంకా స్పందించ లేదు. సాయం కోసం వచ్చిన బాధితురాలి పట్ల మంత్రి ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు జనం.
Also Read : కరోనా బాధిత పిల్లలతో సీఎం దీపోత్సవ్
#Karnataka Housing Minister V Somanna Slaps a woman during a public event to distribute housing documents to EWS. A women who didn't get the papers had approached the minister. Minister lost his cool and slapped her. pic.twitter.com/fbYoSueg7r
— Imran Khan (@KeypadGuerilla) October 23, 2022