Karnataka New Cabinet : కులాల వారీగా మంత్రివర్గంలో చోటు
ఆచి తూచి ఎంపిక చేసిన ఏఐసీసీ
Karnataka New Cabinet : కర్ణాటక కేబినెట్ కూర్పుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. చివరకు కులాల వారీగా ఎనిమిది మందికి చోటు కల్పించింది. ఇప్పటికే సీఎం సీటు విషయంలో నానా తంటాలు పడి చివరకు కొలిక్కి వచ్చేలా ఏసింది. సోనియా గాంధీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో ఓబీసీ, లింగాయత్, ఒక్కల్లిగ , దళిత, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చోటు లభించేలా జాగ్రత్త పడింది.
సీఎంగా కొలువు తీరిన సిద్దరామయ్య ఇతర వెనుకబడిన తరగతి వర్గాలకు చెందిన నాయకుడు. ఇక కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయన కర్ణాటకలో బలమైన సామాజిక వర్గంగా పేరు పొందిన వొక్కల్లిగ కు చెందిన వ్యక్తి. ఇక కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో ఎంబీ పాటిల్ లింగాయత్ కు చెందిన వ్యక్తి కాగా జి. పరమేశ్వర దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
జమీర్ అహ్మద్ ఖాన్(New Cabinet) ముస్లిం కేటగిరీకి చెందగా, కేజే జార్జ్ క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక కేహెచ్ మునియప్ప, ప్రియాంక్ ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు. రామ లింగా రెడ్డి ఓబీసీకి చెందగా సతీష్ జార్కి హోళీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో 224 సీట్లకు గాను 136 సీట్లతో భారీ మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Karnataka Cabinet List