Karunaratne : కరుణరత్నే సంచలన నిర్ణయం
ఇదే తనకు లాస్ట్ సీరీస్ అన్న కెప్టెన్
Karunaratne : శ్రీలంక టెస్టు జట్టు స్కిప్పర్ కరుణ రత్నే కీలక ప్రకటన చేశాడు. తాను ఇక నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా తెలియ చేసినట్లు స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా కీవీస్ తో శ్రీలంక 2-0 తేడాతో ఓటమి పాలైంది.
వచ్చే ఏప్రిల్ నెలలో ఐర్లాండ్ తో టెస్టు సీరీస్ ఆడాల్సి ఉంది శ్రీలంక. ఇదే ఆఖరి సీరీస్ అని పేర్కొన్నాడు కరుణ రత్నే. కాగా కరుణ రత్నే తీసుకున్న నిర్ణయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు శ్రీలంక సెలెక్టర్లు.
గతంలో శ్రీలంక జట్టులో కీలకమైన ఆటగాళ్లు ఉండేవాళ్లు. మహానామా, అరవింద డిజిల్వా, అర్జున రణతుంగ, చమింద వాస్ , మురళీధరన్ దిగ్గజ ఆటగాళ్లు కలిగి ఉండేది. రాను రాను కొంత ఇబ్బందికి లోనైంది శ్రీలంక. 2019 వరకు చండిమాల్ స్కిప్పర్ గా ఉన్నాడు. ఆ తర్వాత కరుణ రత్నే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్ గా దక్షిణిఫ్రికాపై సీరీస్ గెలుపొందాడు. ఇది ఒక రకంగా అతడి కెరీర్ లో ఓ మైలు రాయి అని చెప్పక తప్పదు.
ఇప్పటి వరకు కరుణ రత్నే నాయకత్వంలో శ్రీలంక జట్టు 26 టెస్టులు ఆడింది. ఇందులో 10 టెస్టులలో విజయం సాధించింది శ్రీలంక. 7 డ్రాగా ముగిస్తే 9 టెస్టులలో ఓటమి పాలైంది. ఇప్పటి దాకా కరుణ రత్నే(Karunaratne) తన కెరీర్ లో టెస్టు మ్యాచ్ ల పరంగా 84 టెస్టులు ఆడాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read : సూర్య కంటే సంజూ బెటర్